బ్రేకింగ్.. పది, ఇంటర్ పరీక్షలు రద్దు
1 min readపల్లెవెలుగు వెబ్: పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించారు. జులై 31లోపు ఫలితాలు ప్రకటించాలని సుప్రీం కోర్టు చెప్పిందని, పరీక్షల నిర్వహణకు , పేపర్ల మూల్యాంకనానికి 45 రోజుల సమయం పడుతుందని ఆయన అన్నారు. ఇంత తక్కువ సమయంలో పరీక్షలు నిర్వహించలేమని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థులు నష్టపోకూడదనే పరీక్షల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆయన చెప్పారు. పరీక్షల నిర్వహణ పై ఏపీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ పై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. పరీక్షల నిర్వహించాలనే పట్టుదలతో వెళ్లొద్దని తెలిపింది. ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. విద్యార్థులు ఒక్కరు చనిపోయినా .. కోటి పరిహారం చెల్లించాలని హెచ్చరించింది. సుప్రీం కోర్టు సూచనలు పరిగణనలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసింది.