అమలోద్భవి మాత చర్చ్36వ ప్రతిష్టాపన వార్షికోత్సవ వేడుకలు..
1 min readదేవుని పట్ల ప్రతి ఒక్కరు భక్తి, విశ్వాసాలతో జీవించాలి..
బిషప్ జయరావు పొలిమేర
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రజలు దేవుని పట్ల నిజమైన భక్తి విశ్వాసాలతో జీవించాలని. అప్పుడే వారు దేవుని నుంచి స్వస్థత. కుటుంబ సమస్యల్లో పరిష్కారం పొందుతారని ఏలూరు పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు సూచించారు. స్థానిక జేవియర్ నగర్ లో అమలాద్భవి మాత చర్చి 36వ ప్రతిష్టాపన వార్షికోత్సవం. చర్చి విచారణ గురువు ఫాదర్ ఇంజమాల మైఖేల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాయంత్రం మేరీ మాత స్వరూపంతో స్థానిక సెయింట్ ఆన్స్ కాన్వెంట్ నుంచి కధీడ్రాల్ చర్చి వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. రాత్రి కధీడ్రాల్ ఆవరణలో బిషప్ జయరావు దివ్య బలి పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ జయరావు ను చర్చి విచారణ గురువు ఇంజమాల మైఖేల్ ఆధ్వర్యంలో ఫాదర్ ఏ రాకేష్, డి అబ్రహం, ఎస్ విజయ థామస్ ఘనంగా సన్మానించారు. అనంతరం బాలలకు మొదటి దివ్య ప్రసాదం భద్రమైన అభ్యంగన సాoగ్యాలు ప్రధానం చేశారు. చిన్నారులకు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఫాదర్ బిఈడి కాలేజ్ ప్రిన్సిపాల్ ఫాదర్ పి బాల, డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఫాదర్ జి మోజెస్, మరియు ఫాదర్ టి ఇమ్మానుయేలు, ఫాదర్ బాబు జార్జ్, ఫాదర్ డి ఆరోను, ఫాదర్ బి రాజు, కార్పొరేటర్ ఎం నిర్మల జేవియర్, ఎఎంసి డైరెక్టర్ జి బెనర్జీ,ఐ రత్నరాజు, పలువురు ఫాదర్లు, సిస్టర్లు వేలాదిమంది విశ్వాసులు పాల్గొన్నారు.