హాకీ ఛాంపియన్షిప్ కడప బాలుర జట్టు కైవసం
1 min readకర్నూలుకు నాలుగవ స్థానంముగిసిన రాష్ట్రస్థాయి హాకీ ఛాంపియన్ షిప్
పల్లెవెలుగు వెబ్ కర్నూల్ స్పోర్ట్స్: సోమవారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలు ఫైనల్లో కడప జట్టు 2-1 గోల్స్ తో అనకాపల్లి జిల్లాపై నెగ్గి ఛాంపియన్షిప్ సాధించింది కాగా రన్నర్ గా అనకాపల్లి నిలిచింది. పశ్చిమగోదావరి కి మూడవ స్థానం కర్నూలుకు నాలుగో స్థానం దక్కింది.ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ బి. శంకర్ శర్మ, ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బి. రామాంజనేయులు కలిసి విజేతలకు ట్రోఫీలు పతకాలు, ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు. డాక్టర్ బి శంకర్ శర్మ మాట్లాడుతూ ఓటమితోనే గెలుపు సాధ్యమవుతుందన్నారు. క్షణికావేశంతో ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడాకారులు శరీర సౌష్టం ఆరోగ్యంతో పాటు అటువంటి క్షణికావేశాల గురికాకుండా క్రీడా స్ఫూర్తిని చాటి పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన కితాబిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హాకీకరణం కార్యదర్శి దాసరి సుధీర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రవీణ్, హాకీ ఆంధ్ర ప్రతినిధి థామస్ పీటర్, ఎక్సైజ్ శాఖ మేనేజర్ విశ్వమోహన రెడ్డి, వినోద్ జోషి, క్రీడా సంఘ ప్రతినిధులు శ్రీనివాసులు, గంగాధర్ లతోపాటు సీనియర్ క్రీడాకారులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.