టీడీపీ టికెట్ బిసికా…ఓసికా..!
1 min readటికెట్ పై ధీమా వ్యక్తం చేస్తున్న ఇరువర్గాలు.
ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన మాచాని సోమనాథ్
అయోమయంలో పార్టీ కార్యకర్తలు
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో టీడీపీ లో ఏం జరుగుతోందో కార్యకర్తలకు బీవీ అభిమానులకు అంతుచిక్కడం లేదు. 2014 లోనూ చివరి దాకా బీవీ జయనాగేశ్వరరెడ్డి టికెట్ రాదనే ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో ఆయన నియోజకవర్గాన్ని కొత్త అభ్యర్థి అప్పటికే పదేళ్లు అధికారానికి టీడీపీ క్యాడర్ దూరం కావడంతో అందరూ అధిష్టానం దగ్గర పట్టుబట్టి బీవీని తెచ్చుకున్నారు..ఇప్పుడు ఆ పార్టీలో అప్పటి పరిస్థితులు లేవు క్యాడర్ కు బీవీ కి మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతోనే సర్వేలో నెగటివ్ వచ్చినట్టు సమాచారం. అప్పట్లో మాజీ కేంద్రమంత్రి కోట్ల క్యాంప్ ఆఫీసు ను బీవీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. మరి ఇప్పుడు మాచాని సోమనాథ్ దూకుడు పెంచి ప్రచారం, ఫ్లెక్సీల ఏర్పాటు వరకు యవ్వారం జరుగుతున్నా బీవీ ఎందుకు అడ్డుకోలేకపోతున్నారన్న చర్చ పార్టీలో సాగుతోంది.వైసీపీ లో బుట్టారేణుక పేరు ఏడాదిగా వినబడుతున్నా పార్టీ టికెట్ ప్రకటించే వరకు ఆమె ఎమ్మిగనూరు లో ఎలాంటి కార్యక్రమాలు బహిరంగంగా చేయలేదు. కానీ టీడీపీ లో ఇందుకు భిన్నంగా ఎన్నడూ లేనివిధంగా ఏకంగా అటు బీవీ ఇటు సోమనాథ్ లు పార్టీ కార్యక్రమాన్ని చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మిగనూరులో టీడీపీకి ఎప్పడు ఇలాంటి గడ్డు పరిస్థితి రాలేదని ఇప్పుడు పార్టీ రెండుగా వర్గాలుగా విడిపోయే ప్రమాదముందని పార్టీ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఎవరికి వారు టికెట్ పై ధీమా వ్యక్తం చేస్తున్నా ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. అధిష్టానం వెంటనే టికెట్ పై ప్రకటన చేస్తే తప్ప క్లారిటీ వచ్చే పరిస్థితి లేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.