PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముఖ్యమంత్రి పర్యటన కు  ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలి

1 min read

7 వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు…

ఫిబ్రవరి 15 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు కర్నూలు కు రాక .

భద్రత పరంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి.

కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ సిహెచ్.  విజయరావు  ఐపియస్  జిల్లా ఎస్పీ శ్రీ  జి. కృష్ణకాంత్ ఐపియస్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తేదీన  గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి   కర్నూలు రాక సందర్భంగా భద్రత పరంగా  పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ సిహెచ్.  విజయరావు  ఐపియస్ , జిల్లా ఎస్పీ శ్రీ  జి. కృష్ణకాంత్ ఐపియస్  పర్యటన ఏర్పాట్లను పరిశీలించి  అధికారులకు సూచించారు.ఎమ్మిగనూరు శాసన సభ్యులు చెన్నకేశవ రెడ్డి మనవడు పవన్ కళ్యాణ్ రెడ్డి వివాహామునకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి  హాజరు అవుతున్నందున కర్నూలు బళ్ళారి రోడ్డులోని కింగ్ ప్యాలెస్ గ్రాండ్ కన్వెన్శన్ పరిసరాలను , ఓర్వకల్లు ఏయిర్ పోర్టు లో భద్రతా పరంగా పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ బందోబస్తు విధులలో అడిషనల్ ఎస్పీ ఒకరు , 4 గురు డిఎస్పీలు, 16 మంది సిఐలు, 17 మంది ఎస్సైలు, 63 మంది ఎఎస్సైలు మరియు హెడ్ కానిస్టేబుళ్ళు,  130 మంది కానిస్టేబుళ్ళు ,   18 మంది మహిళా పోలీసులు, 70 మంది హోంగార్డులు ,  మరియు   ఇతర జిల్లాల నుండి  అడిషనల్ ఎస్పీ ఒకరు,  5 మంది డిఎస్పీలు,  9 మంది సిఐలు, 30 మంది ఎస్సైలు,  50 మంది ఎఎస్సైలు మరియు హెడ్ కానిస్టేబుళ్ళు,  110 మంది కానిస్టేబుళ్ళు, 18 మంది మహిళా పోలీసులు, 50 మంది హోంగారులు , 3 స్పెషల్ పార్టీలు, 97  మంది ఎఆర్  పోలీసులు బందోబస్తు విధులలో పాల్గొంటారు.హెలిప్యాడ్ , వాహనాల  పార్కింగ్,  తదితర ఏర్పాట్లకు సంబంధించి  సమన్వయంతో పని చేయాలని  , ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి  వచ్చే ముఖ్యమైన రహదారులను, రూట్ బందోబస్తులను  పరిశీలించారు.పోలీసు అధికారులకు సిబ్బందికి తగిన సూచనలు, సలహాలను  చేశారు.ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజ,  అడిషనల్ ఎస్పీ అడ్మిన్ నాగరాజు, కర్నూలు సబ్ డివిజన్ డిఎస్పీ విజయ శేఖర్, ట్రైనీ డిఎస్పీ భావన,  సిఐలు నాగరాజు యాదవ్, శ్రీనివాస రెడ్డి, శంకరయ్య మరియు ఇతర శాఖల అధికారులు   పాల్గొన్నారు.

About Author