దగా డీఎస్సీ కాదు – మెగా డీఎస్సీ కావాలి – ఏబీవీపీ
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు వంశీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక వైయస్సార్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విభాగ్ ఎస్ ఫ్ డి కన్వీనర్ మారుతి మాట్లాడుతూ జాబ్ క్యాలండర్ల జాడే లేదని, జాబ్ లెస్ క్యాలెండరు తో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు చెవిలో పువ్వు పెట్టిందని, దగా డీఎస్సీ వద్దు – 26 వేల పోస్టులతో కూడిన మెగా డీఎస్సీ కావాలని, డీఎస్సీ కి అర్హత వయస్సు 46సం లకు పెంచాలని, డీఎస్సీ తయారీ కి కనీసం 45 రోజులు సమయం ఇవ్వాలని,ఎన్నికల ముందు ఉద్యోగ నోటిఫికేషన్ల అని ఇది ప్రభుత్వానికి సిగ్గు చేటు అన్నారు. అలాగే 26 వేల పోస్టులతో కూడిన మెగా డీఎస్సీ కావాలని డిమాండ్ చేసారు. కేవలం ఎన్నికల కోసమే ఎన్నికల ముందు ఈ వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులను మభ్య పెట్టడానికి ఈ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం సిద్ధమంటూ ప్రచారాలు చేసుకుంటున్నారని , విద్యార్థులు మరియు నిరుద్యోగులు కూడా మిమ్మల్ని గద్దె దించేందుకు సిద్ధంగానే ఉన్నారని త్వరలోనే ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు కృష్ణ, మల్లికార్జున, గోవర్ధన్, చందు మరియు నాయుడు తదితరులు పాల్గొన్నారు.