రోడ్డు భద్రత మాసోత్సవాలు..
1 min readనవభారత్ పామాయిల్ పరిశ్రమలో ట్రాక్టర్ డ్రైవర్లకు రహదారి భద్రతపై సూచనలు, సలహాలు..
ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ మసలుకోవాలి
ఎం.వి.ఐ కెవిఎస్ ప్రసాద్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏర్పాటుచేసిన రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నియమాలులో భాగంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు తెలుసుకుని వాటిని ప్రతి వాహనదారుడు విధిగా పాటించిన నాడే ప్రమాదాలను నివారించవచ్చునని మోటార్ వెహికల్స్ ఇన్స్పిక్టర్ కెవిఎస్.ప్రసాద్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఉప రవాణా కమిషనర్ ఎస్.శాంతకుమారి అధ్వర్యంలో మంగళవారం జంగారెడ్డిగూడెం నవ భారత్ పామాయిల్ పరిశ్రమ నందు ట్రాక్టర్, లారీ డ్రైవర్లకు రహదారి భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రాణం చాల విలువైనదని, అతివేగం, అవగాహన లోపం మరియు నిర్లక్ష్యం వలన ప్రాణాలు కోల్పోవడంతో పాటు వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. వాహనాలపై అధిక లోడు వేయడం వలన వాహనం అదుపు తప్పి ప్రమాదాలు జరగడంతో పాటు వాహన ఇంజిన్, రోడ్డులు త్వరగా పాడవుతాయని తెలిపారు. కార్యక్రమములో మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ కెవిఎస్.ప్రసాద్, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ వి.ఎల్.ప్రవీణ, నవ భారత్ పామాయిల్ పరిశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.