PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూ.2.5 కోట్ల బంగారం పట్టివేత

1 min read

– సరైన పత్రాలు, ఆధారాలు చూపకపోవడంతో సీజ్​
– వెల్లడించిన డీఎస్పీ మహేష్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: రాష్ట్ర సరిహద్దు..పంచలింగాల చెక్​ పోస్టు వద్ద వాహనాల తనిఖీలో 2.5 కోట్లు విలువ చేసే 5 కేజీల 85 గ్రాముల బంగారం
గుర్తించి.. సరైన పత్రాలు చూపకపోవడంతో పోలీసులు సీజ్​ చేశారు. కర్నూలు డీఎస్పీ మహేష్​ తెలిపిన వివరాలు. కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప , సెబ్​ అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి ఐపియస్ ఆదేశాల మేరకు పంచ లింగాల రాష్ట్ర సరిహద్దు చెక్​ పోస్టులో గురువారం తెల్లవారు జామున సెబ్​ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో లోకల్​, సెబ్​ పోలీసులు కలిసి వాహనాలు తనిఖీ చేశారు. హైదరాబాదు –బెంగళూరు వెళుతున్న (AP 39 TG8888) ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నందు ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన నగల వ్యాపారి మహావీర్ జైన్ ( అరిహంత్ జ్యువెలరీ షాప్ , శివాజీ నగర్ నార్త్ బెంగళూరు ) తన బ్యాగులో సుమారు 5 కేజీల 85 గ్రాములు (45 బంగారు బిస్కెట్లు , రెండు నెక్లెస్ లను ) సోదాల్లో గుర్తించారు . వాటికి సంబంధించి సరైన పత్రాలు ,ఆధారాలు, ఈ – వే బిల్లులు చూపనందున వాటిని కర్నూల్ తాలూకా పోలీస్ స్టేషన్ నందు తదుపరి చర్య నిమిత్తం అప్పగించారు. చెక్ పోస్టు వద్ద తనిఖీలో సిఐ కంటగిరి రాముడు, SI లు ఖాజా వాలి , లక్ష్మి నారాయణ మరియు సిబ్బంది పాల్గొన్నారు .

About Author