ఐఐటి, జేఈఈ మెయిన్స్-2024 ఫలితాల్లో మెరిసిన బీరం విద్యార్థులు
1 min readపల్లవెలుగు వెబ్ చెన్నూరు: జేఈఈ మెయిన్స్- 2024 ఫలితాల్లో బీరం జూనియర్ కళాశాల విద్యార్థులు అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నారు.ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విజయ డంకా మోగించి 99 శాతానికి పైగా నలుగురు విద్యార్థులు,98 శాతానికి పైగా ఆరుగురు విద్యార్థులు,95 శాతానికి పైగా 11 విద్యార్థులు,90 శాతానికి పైగా 17 మంది విద్యార్థులు పర్సంటైల్ సాధించారు.
బీరం విద్యా కుసుమాలైన
వి సాత్విక – 99.62
పి. లక్ష్మీ గణేష్ -99.51
జి. నాగ దత్తేశ్వర కుమార్ – 99.32
పి. కేదార్నాథ్ – 99.13
సి.విష్ణువర్ధన్ – 98.40
పి. లక్ష్మీ భావన -98.00
పి. ప్రియ దీపిక – 97.01
ఎన్. అఖిల్ కుమార్ – 97.01
సి.హరి ధనుష్ – 95.61
కె.సుమంత్ రెడ్డి – 95.34
బి. సాయి తేజ రెడ్డి – 95.12
పర్సంటైల్ తో ఆల్ ఇండియా స్థాయిలో బీరం శ్రీధర్ రెడ్డి కళాశాల కీర్తి పతాకాన్ని ఎగురవేశారు.
ఈ విజయోత్సాహంలో కరస్పాండెంట్ సుబ్బారెడ్డి, చైర్ పర్సన్ సరస్వతమ్మ ల మాట్లాడుతూ కళాశాల స్థాపించిన అతి తక్కువ కాలంలోనే మొదటి బ్యాచ్ తోనే ర్యాంకులు సాధించడమే కాకుండా, రెండవ బ్యాచ్ లో కూడా ర్యాంకులు సాధించి,భవిష్యత్తులో కూడా ఇలా ర్యాంకుల పరంపర కొనసాగుతుందని తమ ఆశాభావాన్ని వ్యక్తం చేసి విద్యార్థులను,అధ్యాపకులను అభినందించారు.మరియు బీరం కళాశాల డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్ మాట్లాడుతూ ర్యాంకులు సాధించిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ లో ప్రతిష్టాత్మకమైన ఎన్ఐటి, ఐఐటీలో సీట్లు సాధిస్తారని, బీరం కళాశాల ఐఐటి, నీట్ ర్యాంకులకు బ్రాండ్ గా మారిందని తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.మరియు బీరం కళాశాల అత్యున్నతమైన విద్యా ప్రమాణాలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇప్పుడు మన కడప నగరంలో కూడా బ్రాంచ్ ను స్థాపించామని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని తెలిపారు. మరియు విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్వేతాకళాశాల ప్రిన్సిపాల్ హేమచందర్ గారు మాట్లాడుతూ తమ విద్యార్థులు ఇటువంటి అత్యున్నత విజయాలు సాధించడానికి మా విద్యాసంస్థల్లో అవలంబిస్తున్నటువంటి ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం హై స్కూల్ స్థాయి నుండే ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు ముందస్తు స్థాయిలో విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నామని దాని కారణంగానే ఇంత గొప్ప ఉన్నత ర్యాంకులు సాధించగలుగుతున్నామని వారు తెలిపారు.