18 ఏళ్లు నిండిన వారిని.. ఓటరుగా నమోదు చేయించండి
1 min readజిల్లా రెవెన్యూ అధికారి కె మధుసూదన్ రావు
కర్నూలు, పల్లెవెలుగు:18 సంవత్సరాలు నిండిన వారందరిని ఓటరుగా నమోదు చేయించడానికి సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె మధుసూదన్ రావు పొలిటికల్ పార్టీ ప్రతినిధులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో తుది ఓటర్ల జాబితా ప్రచురణ పై మరియు పోలింగ్ స్టేషన్లలో మౌలిక వసతుల గురించి పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో జిల్లా రెవెన్యూ అధికారి కె మధుసూదన్ రావు సమీక్ష నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి కె మధుసూదన్ రావు మాట్లాడుతూ మీ ప్రాంతాలలో 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఓటరుగా నమోదు చేయించడానికి సహకరించాలని పొలిటికల్ పార్టీ ప్రతినిధులకు సూచించారు. 80 సంవత్సరాలు నిండి నడవలేని వృద్ధులకు వారు ఫారం 12 D ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఇంటి వద్ద నుండి వారు ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందన్నారు.ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా ఎన్నికల అధికారి / జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకురావాలని డిఆర్ఓ పొలిటికల్ పార్టీ ప్రతినిధులకు సూచించారు. తదనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ కొన్ని పోలింగ్ స్టేషన్ లలో ఉన్న సమస్యలను , కొన్ని పోలింగ్ స్టేషన్ లు 2 కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరంగా ఉన్నట్లు, తదితర సమస్యలను డిఆర్ఓ దృష్టికి తీసుకురాగా డిఆర్ఓ స్పందిస్తూ పోలింగ్ స్టేషన్ ల మార్పులు చేర్పుల జరిగిన తరువాత వివరాలు రాజకీయ పార్టీలకు అందజేయగలమని సమస్యలను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. సమావేశంలో , బిజెపి పార్టీ ప్రతినిధి సాయి ప్రదీప్, టిడిపి పార్టీ ప్రతినిధి ఎల్వి ప్రసాద్, వైఎస్సార్ పార్టీ ప్రతినిధి కె.పుల్లారెడ్డి, సిపిఐ, ఇండియన్ కాంగ్రెస్ ప్రతినిధులు ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ మురళీ తదితరులు పాల్గొన్నారు.