ఎమ్మెల్యే మనవడి… వివాహానికి హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి
1 min readనూతన వధూవరులు పవన్ కళ్యాణ్ రెడ్డి, కీర్తన రెడ్డి లను ఆశీర్వదించిన ముఖ్య మంత్రివర్యులు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కె.చెన్నకేశవ రెడ్డి మనవడు పవన్ కళ్యాణ్ రెడ్డి వివాహం గురువారం కర్నూలు – కోడుమూరు రోడ్డు మార్గంలో ఉన్న కింగ్ ప్యాలస్ గ్రాండ్ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు. వివాహ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు నుండి నుండి బయలుదేరి ఉదయం 11.26 గంటలకు ఫంక్షన్ హాల్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకున్నారు. అనంతరం 11.38 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 11.44 గంటలకు కింగ్ ప్యాలస్ గ్రాండ్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ కి చేరుకొని 11.47 గంటలకు నూతన వధూవరులు పవన్ కళ్యాణ్ రెడ్డి, కీర్తన రెడ్డి లను ఆశీర్వదించారు. అనంతరం వేదిక మీద ఉన్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్న కేశవ రెడ్డి, కుమారుడు జగన్మోహన్ రెడ్డి, వధూ వరులు, వారి కుటుంబ సభ్యులను పేరు పేరున పలకరించి వారితో గ్రూప్ ఫోటో దిగారు.. వివాహ వేడుకల అనంతరం ముఖ్యమంత్రి వర్యులు మధ్యాహ్నం 12.07 గంటలకు హెలిప్యాడ్ చేరుకొని 12.09 గంటలకు ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ కు బయలుదేరి వెళ్ళారు.. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కె.చెన్నకేశవ రెడ్డి మనవడు పవన్ కళ్యాణ్ రెడ్డి వివాహ వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు హాజరయ్యారు.ఎమ్మెల్యే ఎమ్మిగనూరు చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ , కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ,ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన , ఎమ్మెల్సీలు రామ సుబ్బారెడ్డి, మధుసూధన్, కర్నూల్ మున్సిపల్ మేయర్ బి వై రామయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ,నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విజయ మనోహరి, కర్నూలు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర్ రెడ్డి, నంద్యాల జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్, డిసిఎమ్ఎస్ చైర్మన్ శిరోమణి మద్దయ్య, డెప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, మాజీ పార్లమెంట్ సభ్యులు బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.