రైతులకు సంఘీభావంగా ఎస్ డి పి ఐ నిలుస్తుంది
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: గౌరవనీయులైన ఎమ్మార్వో అయ్యా గత రెండు సంవత్సరాల క్రితం దేశ రాజధాని అయిన ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున రైతుల వ్యతిరేక బిల్లుల గురించి 11 నెలలు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాలో 700 మంది రైతులు చనిపోయారు కొన్ని వందల మందికి గాయాలు అయ్యాయి 11 నెలలు ధర్నా చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీ డిమాండ్ ను అంగీకరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది MSP మినిమం సేల్స్ ప్రైస్ బిల్లు తెస్తామని హామీ ఇచ్చారు కానీ రెండేళ్లు గడిచిన ఇంతవరకు అమల్లోకి రావడం లేదని ప్రస్తుతం రైతులు ఆందోళనకు దిగారు కేంద్రం మొండి వైఖరిని వీడి రైతులకు అనుకూలంగా బిల్లులు అమలు చేయాలని రైతుల తరఫున ఎస్ డి పి ఐ పార్టీ నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేయడం జరిగింది మరియు ఎస్ డి పి ఐ నాయకులు మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని నాలుగు లక్షల వరకు రుణమాఫీ చేయాలని అలాగే వర్షాలు లేక రైతులు నష్టపోయారని పత్తి వేరుశనగ వరి మిర్చి వేసిన రైతులకు నష్టపరిహారంగా ఎకరాకు 40,000 నష్టపరిహారంగా ఇవ్వాలని అలాగే తొమ్మిది గంటలు ఇచ్చే అగ్రికల్చర్ లైన్ ప్రస్తుతం ఏడు గంటలకు ఇవ్వడం రైతులకు నష్టాల్లో నెట్టివేయడం జరుగుతుందని 9 గంటలు కంటిన్యూగా కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రైతులతో కలిసి తాసిల్దార్ ఆఫీస్ ఎదుట పెద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు, ఎస్ డి పి ఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.