రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ని కలిసిన బుడగ జంగాల కులస్తులు..
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు : మాకు ఇళ్ల స్థలాలు వచ్చేలా చూడాలంటూ ఈ రోజు ఉదయం ఆలూరు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ను కలిసిన బుడగ జంగాల కులస్తులు.దేవనకొండ మండలానికి చెందిన బుడగ జంగాలకు కులదృవీకరణ పత్రాలు లేవంటూ మరియు ఇళ్ల స్థలాలు లేక ఎన్నో ఏళ్లగా రోడ్లు పక్కన డేరాలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నామని కొండలు గుట్టలలో డేరాలు వేసుకొని ఉండడం వల్ల రాత్రిపూట పాము కాటుకు గురై ఇద్దరు చిన్నారులు ప్రాణాలు విడిచారని వారు మంత్రి జయరాంకు తెలిపారు.ఎలాగైనా మమ్మల్ని ఆదుకోవాలంటూ ఆలూరు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ కార్యదర్శి మునిస్వామి ఆధ్వర్యంలో ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కు వినతి పత్రం అందజేశారు.వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం మంత్రి జయరాం దేవనకొండ మండలంలో వారికి ప్రభుత్వం పథకాలు ద్వారా బుడగ జంగాల వారికి ప్రభుత్వ భూమి ఉన్నచోట ఒక్కో కుటుంబానికి మూడు సెంట్లు స్థలం ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు.అంతేకాదు బుడగ బుడగ జంగాల కులస్తులు కుల ధ్రువీకరణ పత్రం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారికి ఎలాగైనా న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి గుమ్మనూరు జయరాం వారికి హామీ ఇచ్చారు.