దేశవ్యాప్త సమ్మె (బంద్) జయప్రదం
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం : రైతు సంఘాల సంయుక్త సమితి, కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపులో భాగంగా శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా జరిగిన సమ్మెను(సిఐటియు. ఎస్ఎఫ్ఐ. సమాజ్ వాది పార్టీ ఆధ్వర్యంలో పాణ్యం మండల కేంద్రంలో బంద్ విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపారు .ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి కె భాస్కర్ సమాజ్ వాది పార్టీ జిల్లా అధ్యక్షులు. శివకృష్ణ యాదవ్ ఎస్ఎఫ్ఐ బత్తిన ప్రతాప్ మాట్లాడుతూ డ్రైవర్లను జైలుపాలు చేసే హిట్&రన్ సెక్షన్ 106-(1)(2) రద్దు చేయాలనీ.అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలనీ.కాలపరిమితి ముగిసిన అన్ని షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్ల కనీస వేతనాల జీవోలను వెంటనే సవరించాలనీ డిమాండ్ చేశారు.2021లో విడుదల చేసిన 5 కనీస వేతనాల జీవోలను వెంటనే గెజిట్ చేసి అమలు చేయాలనీ.ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం ప్రైవేటుపరం చేయడం ఆపాలన్నారు.ఈ దేశ వ్యాప్త సమ్మె బందులో పాల్గొన్నవారు విద్యార్థి సంఘం ప్రతాప్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వెంకటాద్రి ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు నాగ రాజు చంద్ర. వెంకటరమణ బాలకృష్ణ హమాలి యూనియన్ నాయకులు సుదర్శన్. రైతు సంఘం నాయకులు ప్రసాద్ .ఆటో కార్మికులు . హమాలి కార్మికులుతదితరులు పాల్గొన్నారు.