డాక్టర్ బాబు జగజీవన్ రామ్ భవనం ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే
1 min readఎస్సీ, బీసీ, మైనార్టీ లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారు
పెద్ద ఎత్తున తరలివచ్చిన సంఘ నాయకులు, పార్టీ నాయకులు, ఉద్యోగులు, అభిమానులు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరులో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ మాదిగ భవన ప్రారంభోత్సవ తంగళ్ళమూడి 49వ డివిజన్ లో కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసారు. నానికి సంఘ నాయకులు పెద్ద ఎత్తున గజమాలను వేసి, శాలువాలు కప్పి బొకేలు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. వారి అభివృద్ధికి, సంక్షేమానికి మరింత మెరుగయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారని మనమంతా ఆయనకు అండగా నిలవాలని కోరారు. 25 లక్షలు వ్యయంతో ఈ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేశామని, రాబోయే రోజుల్లో పై అంతస్థకు మరిన్ని నిధులు సమకూర్చే విధంగా ఏలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ సహకారంతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏలూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఉండటంతో నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు కృషి సహకారం ఎంతో ఉందన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మహిళలు, అభిమానులు పార్టీ నాయకులు విచ్చేయడం ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ మాదిగ భావన స్థలం కోసం సంఘ నాయకులు అనేక పర్యాయాలు నన్ను కలవడం జరిగిందని, విశ్రమించకుండా వారు చేసిన కృషికి ఫలితంగా ఈ స్థలం కేటాయించడం జరిగిందన్నారు. ఏలూరు నడిబొడ్డులో ఇంత ఖరీదైన స్థలం దొరకడం మీ అందరి అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆప్షన్స్ సభ్యులు మున్నూరు జాన్ గుర్నాథ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఇoత పెద్ద స్థలం ఆళ్ల నాని కేటాయించడం అభినందనీయమని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన రుణం రాబోయే ఎన్నికల్లో ఓట్లతో ఆయన విజయానికి కృషిచేసి మనమంతా రుణం తీర్చుకోవాలన్నారు.లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సొంగా సందీప్ మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పట్ల తండ్రి స్థానంలో ఉంటే ఈ ఏలూరు నియోజకవర్గానికి ముఖ్యంగా మా మాల, మాదిగ, రెల్లి కులాలకు మూల స్తంభం స్థానంలో ఆళ్ల నాని ఉన్నారని కొనియాడారు. అంతే కాకుండా ఏలూరు జిల్లా ఏడు నియోజకవర్గాలకు కూడా ఆయన నాయకత్వంలో నడిపిస్తున్నారని ఏలూరు నగర నడిబొడ్డున ఈ భవనాన్ని 500 గజాల స్థలం కేటాయించి ఈ భవన నిర్మాణానికి కృషి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2024 ఎలక్షన్లకు నాని నాయకత్వంలో మేమంతా పనిచేయడానికి ముఖ్యంగా దళితులంతా ఓట్లు వేసి వైస్సార్సీపీ పార్టీ ఋణం తీర్చుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్ బాబు, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి , ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవి, కిలాడి దుర్గారావు, నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు, పొలిమేర హరికృష్ణ, కందుల రమేష్ , తోటకూర కిషోర్, ఇనపనూరి కేదారేశ్వరి జగదీష్, మేతర అజయ్ బాబు, మేతర సురేష్, కృష్ణ, సోంగా మధు, జుజ్జువరపు విజయనిర్మల, పెళ్ళాంగోళ్ళ శ్రీదేవి మరియు వివిధ శాఖల ఉద్యోగస్తులు, సంఘాల నాయకులు, అభిమానులు, పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేశారు.