కుల, మత బేధాలు లేకుండా అభివృద్ధి చేస్తాం.. టిడిపి ఇంచార్జి టి.జి భరత్
1 min read12వ వార్డులో తెలుగుదేశం పార్టీలో చేరిన ముస్లీంలు
మత రాజకీయాలు చేసేవారిని నమ్మొద్దన్న టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కుల, మత బేధాలు లేకుండా తాము అందరికీ సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధి చేస్తామని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని 12వ వార్డులోని జండా వీధిలో మాలిక్ బాషా, అబ్దుల్ అహ్మద్‌లు తమ అనుచరులతో కలిసి టి.జి భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ మత రాజకీయాలు చేసే వారిని నమ్మొద్దని కోరారు. ఎన్నికల సమయంలో తమను ముస్లీంలకు దూరం చేయడానికి ఎన్నో కుట్రలు చేస్తారని మండిపడ్డారు. కర్నూల్లో హిందూ, ముస్లీం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా అందరినీ గౌరవించి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చే ఉచిత ఇసుక విధానం వల్ల భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వారందరికీ మేలు జరుగుతుందన్నారు. ఈ ప్రభుత్వంలో అందకుండా పోయిన దుల్హన్ పథకాన్ని అందరికీ అందిస్తామన్నారు. రంజాన్ తోఫాను ప్రతి కుటుంబానికి తీసుకెళ్లి ఇస్తామన్నారు.అన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చామంటున్న నాయకులను నమ్మొద్దు తమ ఉద్యోగాలన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చామని మాయమాటలు చెబుతున్న ఈ రాజకీయ నాయకులను నమ్మొద్దని టి.జి భరత్ తెలిపారు. అన్నీ వదులుకొని వస్తే రాజకీయాల్లో డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకుంటారన్నారు. తమ కుటుంబం చరిత్ర చూస్తే ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలే గుర్తుకొస్తాయన్నారు. కేవలం ఎన్నికలకు వారం, పదిరోజుల ముందు తమపై దుష్ప్రచారం చేస్తారన్నారు. బీజేపీ, ఆర్.ఎస్.ఎస్ నేతలను కలిశామని చెబుతారని.. అయితే తాము ఎవరిని కలిసినా కర్నూల్లోని ముస్లింలకు ఏరోజైనా ద్రోహం చేశామని అని టి.జి భరత్ ప్రశ్నించారు. ముస్లింలకు టి.జి కుటుంబం కీడు చేసిందని చెప్పడానికి ఒక్కటి కూడా ఉండదన్నారు. ఇవన్నీ ప్రజలు ఆలోచించాలని తాను కోరుతున్నట్లు చెప్పారు. ఎలాంటి అభివృద్ధి చెయ్యని వీళ్లు కుల, మత రాజకీయాలు చేసి ఓట్లు పొందేందుకు చూస్తారని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసే నాయకుడు, ప్రభుత్వాన్ని ముస్లీం పెద్దలు, యువత గుర్తించాలని కోరారు. కర్నూల్లో తాను గెలిస్తే యువతకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ తనకు ఓటు వేసి గెలిపించాలని టి.జి భరత్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు చిన్నమ్మ, తిరుపాల్ బాబు, ఈశ్వర్, మెహబూబ్ ఖాన్, తారనాథ్, పెంచలయ్య, ఆనంద్, మాధవస్వామి, పండు, విజేత, శీను, బాలు, వినోద్, అర్జున్, మద్దయ్య, చందు అరుణ, సరోజ, సువర్ణ, లలిత గాయత్రి, చందన, గిరి, మాలిక్ సలాం, రజాక్, అబ్దుల్లా, మియా బాషా, సోను, సాదిక్, సుజాత, వలి, సుల్ఫీ ఖాదర్, జాకీర్, మహబూబ్, ఇసాక్, ఇర్ఫాన్, ఇమ్రాన్ అజార్, తదితరులు పాల్గొన్నారు.