కశ్మీర్ లో ఎన్నికలు.. స్పెషల్ స్టేటస్ కోసం పట్టు
1 min readపల్లెవెలుగు వెబ్: జమ్మూ, కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. పునాది స్థాయి నుంచి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ ప్రకటించారు. ఎన్నికల నిర్వహణ ద్వార ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిపారు. జమ్మూ, కశ్మీర్ నేతలతో గురువారం ప్రధాని మోదీ భేటీ అయ్యారు. జమ్మూకశ్మీర్ లో ఎన్నికల నిర్వహించాలన్న కశ్మీర్ పార్టీల డిమాండ్ ఒప్పుకోవడం గమానార్హం. అయితే..ఎన్నికలను నియోజకవర్గాల పునర్విభజనతో కేంద్రం ముడిపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ముందే ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రజల మధ్య దూరంతో పాటు, ఢిల్లీకి ..జమ్మూ కశ్మీర్ కి మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా మోదీని కోరారు.