PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపం గ్రామ సచివాలయాలు

1 min read

గడప వద్దకే పాలన అందిస్తున్న సీఎం జగన్..

శాశ్విత కార్యాలయ భవన నిర్మాణాలతో మారిన పల్లెల రూపురేఖలు.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపంగా జగనన్న ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయాలు నిలు స్తున్నాయని  నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు.  సోమవారం నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామ పంచాయతీలో  ఒకే ప్రాంగణంలో నూతనంగా  నిర్మించిన గ్రామ సచివాలయం,  డా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ భవనాలును   ఎంఎల్ఏ ఆర్థర్  ప్రారంభించారు.  దామ గట్ల నుండి నాగలూటి గ్రామానికి సుమారు రూ. 10 లక్షల వ్యయంతో వేసిన మెటల్ రోడ్డు. రూ.43.60 లక్షల  వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం , రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన .వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్  భవనము లను ప్రారంభోత్సవం చేసి గ్రామ ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్  మాట్లాడుతూ  సీఎం జగన్  గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి  దేశంలో ఎక్కడా లేని విధంగా   పారదర్శకంగా, ప్రతిష్టాత్మకంగా గ్రామ స్థాయిలోనే ప్రజలకు సేవలందిస్తున్నారు. ప్రజా అవసరాల నిమిత్తం మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా  వ్యయ, ప్రయాసలు లేకుండా చేశారన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలను అందచేస్తున్నారన్నారు. గ్రామ సచివాలయాలకు కోట్లాది  రూపాయలుతో శాశ్విత కార్యాలయ భవనాలను నిర్మించి పల్లెల మార్పుకు  శ్రీకారం చుట్టారన్నారు.ప్రజల చెంతకే పాలనను సీఎం జగన్ అందిస్తున్నారన్నారు.2వేలు జ‌నాభా దాటిన ప్ర‌తి గ్రామానికి స‌చివాల‌యాన్ని తీసుకొచ్చి ప‌రిపాల‌న‌ను స‌ర‌ళీక‌రించిన ఘ‌న‌త త‌మ ప్ర‌భుత్వానిదేన‌ని చెప్పారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం,వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ ల నూతన   భవనాలు, నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధి పనుల కళ్ళకు కట్టినట్లుగా కనపడుతు న్నాయన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్ కు దక్కుతుందన్నారు. రూ 2.55 లక్షల కోట్ల నిధులును వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు అందించడం జరిగిందని,ఒక రాయచోటి నియోజక వర్గంలోనే  సంక్షేమ పథకాల ద్వారా రూ 2 వేల  కోట్ల నిధులు ప్రజలకు నేరుగా అందడం ఒక చరిత్ర అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరేష్ కృష్ణ ,గ్రామ    సర్పంచ్  మాధవరం.సుశీలమ్మ , రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్  గంగిరెడ్డి రమాదేవి , నందికొట్కూరు మండల నాయకులు  ఉండవల్లి ధర్మారెడ్డి , మున్సిపల్ కౌన్సిలర్  మొల్ల జాకీర్ హుస్సేన్, బ్రాహ్మణకొట్కూరు మాజీ సింగిల్ అధ్యక్షులు మద్దూరు హరి సర్వోత్తమ్ రెడ్డి , నందికొట్కూరు సొసైటీ సింగిల్ విండో మాజీ అధ్యక్షులు  చందమాల బాలస్వామి , నంద్యాల జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ , కార్యవర్గ సభ్యులు  షేక్ ఇనాయతుల్లా , బి.సి.సంఘం నాయకులు  కురుమూర్తి ,  ఎల్ఐసి విశ్రాంత అధికారి మాధవరం. ఏసురత్నం , వైసీపీ నాయకులు వేల్పుల నాగన్న, మాధవరం రత్నం, సంజన్న, నతానియేలు, బ్రాహ్మణ కొట్కూరు ఉదయ కిరణ్ రెడ్డి,రఘు రెడ్డి, వేంకటేశ్వర్లు, పగిడ్యాల మండల నాయకులు  చిట్టి రెడ్డి , ఉదయ్ కిరణ్ రెడ్డి, తాటిపాటి అయ్యన్న, శాతనకోట వెంకటేశ్వర్లు, పగిడ్యాల రాజు, లక్ష్మాపురం గౌడ్, ప్రాతకోట వెంకటరెడ్డి, తిమ్మాపురం నాగన్న, సుంకేసుల వెంకటేశ్వర్లు, ఉప్పలదడియ వీరారెడ్డి, పీర్ సాబ్ పేట శేఖర్ రెడ్డి, మాసపేట వెంకటరామిరెడ్డి, ఎంపిడిఓ శ్రీ నరేష్ కృష్ణ , పి.ఆర్. డి.ఈ  శ్రీ దని బాబు గారు, ఏఈ ప్రతాప రెడ్డి  వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author