NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆలూరు అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పోటీ…

1 min read

చంద్రబాబును సీఎం చేసుకోవడమే లక్ష్యం

అనుచరులతో ప్రచారం నిర్వహించిన ఎల్లార్తి మల్లికార్జున

అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు, టీడీపీ క్యాడర్

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : తాను పుట్టిన గడ్డను అభివృద్ధి చేసుకోవడం కోసమే MLA గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యానని టీడీపీ సీనియర్ నాయకుడు ప్రజాసేవకుడు ఎల్లార్తి మల్లికార్జున అన్నారు.ఈసందర్భంగా మంగళవారం తన అనుచరులతో కలిసి ఆలూరు పట్టణ కేంద్రంలో టీడీపీ ని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకోవడమే తన లక్ష్యం అని,ఆలూరులో ఈసారి టీడీపీ జెండా ఎగురవేస్తామని ఆయన అన్నారు.ఆలూరు ప్రాంతం అభివృద్ధి కావాలంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు ద్వారానే సాధ్యం అవుతుందని, చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకుని ఈప్రాంతంలో ఉన్న తాగు, సాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించుకుందామని ఆయన అన్నారు.ఆలూరు పట్టణంలో టీడీపీ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు.ఈసందర్భంగా ఆయనకు ప్రజలు,టీడీపీ క్యాడర్ అంతా ఘనంగా స్వాగతిస్తూ,ఆహ్వానం పలికారు. ఈకార్యక్రమంలోదేవనకొండ,హాలహర్వి,హోలగుంద మండల టీడీపీ నాయకులు తిమ్మప్ప,రవికుమార్,వెంకటేష్,మంగయ్య, షేకన్న,భీమా, కాంత,వెంకట్,నాగరాజు, నవీన్,మోహన్,శేఖర్,అంజి,అశోక్,ప్రకాష్,గురుస్వామి, ఈరన్న,వీరేశ్,వెంకటేష్,ఈరన్న,శశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author