రవాణా వ్యవస్థలో ఆటో డ్రైవర్లకు ఎదురవుతున్న సమస్యలపై స్పెషల్ డ్రైవ్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: బుధవారం 21-02-2024 తేదీన కర్నూల్ నగరంలోని స్థానిక జిల్లా కోర్టులోని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఆటో డ్రైవర్లకు రవాణా వ్యవస్థలో ఎదురైతే ఇబ్బందులపై నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సిహెచ్. వెంకట నాగ శ్రీనివాసరావు, శాశ్వత లోక్ అదాలత్ ప్రజా ప్రయోజన సేవల అధ్యక్షుడు ఎం. వెంకట హరినాథ్, ఆర్టీవో ఆఫీసర్ రమేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా వ్యవస్థలో ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ పంపిణీలో ఎదురవుతున్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలని వాటిపై స్పెషల్ డ్రైవ్ కల్పించారు, అలాగే 18 ఏళ్ల నిండిన వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కచ్చితంగా కలిగి ఉండాలని, అలా లేని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ అధికారులు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.