PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా పురస్కారాలు

1 min read

-ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు :  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మదిలో నుండి పుట్టినవే గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ అని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, గురువారం ఆయన స్థానిక మండల సభ భవనంలో ఏర్పాటు చేసిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సచివాలయాలతోనే సాధ్యమని భావించి సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగిందన్నారు, ప్రజలకు సచివాలయాలకు అనుసంధానంగా ఉండేందుకు వాలంటరీ వ్యవస్థ తీసుకురావడం జరిగిందన్నారు, ఇందులో భాగంగా 50 ఇండ్ల కు ఒక వాలంటరీ నీ నియమించి అక్కడ సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా వాలంటీర్ల సంక్షేమ పథకాలతో పాటు అక్కడి సమస్యలను కూడా పరిష్కరించడం జరిగింది అన్నారు, ఈ వ్యవస్థ అంతా కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే విధంగా ముఖ్యమంత్రి రూపుదిద్దించడం జరిగిందన్నారు, ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు వాలంటీర్లు చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం వారికి పురస్కారాలను అందించడం జరుగుతుందన్నారు, ఇందులో భాగంగా చెన్నూరు మండలంలో 5 మందికి సేవా రత్న పురస్కారాలు, అదేవిధంగా మిగిలిన వాలంటీర్ల అందరికీ సేవా మిత్ర పురస్కారం అందించి వారిని ఘనంగా సన్మానించడం జరిగిందన్నారు, దీంతో మండల వ్యాప్తంగా 193 మందికి ఈ పురస్కారాల తో పాటు నగదు బహుమతులు అందించడం జరిగిందన్నారు, ఇదంతా కూడా వాలంటీర్లకు ప్రభుత్వం అందించే ఒక చిన్న చిరుకానుక మాత్రమేనని భవిష్యత్తులో వారి సేవలకు మరింత ప్రోత్సహించే విధంగా చూడడం జరుగుతుందన్నారు, వాలంటీర్లు తమ గ్రామాలలో ప్రజలకు ఎంత సేవ చేస్తే అంత గుర్తింపు వస్తుందని, ఆ గుర్తింపు ప్రభుత్వానికి ఎంతో పేరుని తీసుకురావడం జరుగుతుందని ఆయన వాలంటీర్లకు తెలియజేశారు, అనంతరం వాలంటీర్లు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు, ఈ కార్యక్రమంలో చింతకొమ్మదిన్నె జెడ్పిటిసి పోచం రెడ్డి నరేన్ రామాంజనేయులు రెడ్డి, వైయస్సార్సీపి జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, వైయస్ఆర్సీపీ మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, జడ్పిటిసి దిలీప్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, ముదిరెడ్డి సుబ్బారెడ్డి, జే సి ఎస్ మండల కన్వీనర్ ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, జే సి ఎస్ టౌన్ కన్వీనర్ శ్రీనివాసరాజు, మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్, మండల కో ఆప్షన్ నెంబర్ వారిష్, రాష్ట్ర చిన్న పరిశ్రమల శాఖ డైరెక్టర్ చల్ల వెంకటసుబ్బారెడ్డి, సొసైటీ అధ్యక్షులు అల్లి శ్రీరామమూర్తి, సర్పంచులు, వెంకటసుబ్బయ్య, తుంగ చంద్రశేఖర్ యాదవ్, సొంతం నారాయణరెడ్డి, సుదర్శన్ రెడ్డి, ఎంపీటీసీ రఘురాం రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, అధికారులు, ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు పాల్గొన్నారు.

About Author