వాలంటీర్లకు సేవ పురస్కారాలు…
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలోని కుర్ణీ కళ్యాణ మండపం నందు ఎమ్మెల్యే “ఎర్రకోట చెన్నకేశవరెడ్డి” ఆదేశాల మేరకు పట్టణ వాలంటీర్ల సేవా పురస్కారాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక , వాలంటీయర్ల కు సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర లను వాలంటీర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి బుట్టా రేణుక మాట్లాడుతూ వాలంటీర్స్ సిస్టమ్ అనేది ఏపీ ప్రభుత్వపు అతి ముఖ్యమైన కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రయోజనాలను అర్హత కలిగిన లబ్దిదారులు అందరికీ ఇంటి వద్దకే చేరవేయడం వీటి పని. వాలంటీర్ వ్యవస్థ ద్వారా పట్టణ, గ్రామాల్లో ప్రజలు అందరూ సులభంగానే ప్రభుత్వ సర్వీసులు పొందడం వీలవుతుంది. సంక్షేమ పథకాల ప్రయోజాలు పొందొచ్చు. తద్వారా పట్టణ, గ్రామీణాభివృద్ధి సాధ్యం అవుతుంది. మహాత్మా గాంధీ చెప్పినట్లు పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు అనే మాటలను జగన్ నిజం చేశారని చెప్పుకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బుట్టా ప్రతూల్, రాష్ట్ర కుర్ణీ కార్పొరేషన్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్లు, పట్టణ అధ్యక్షులు, జె సి ఎస్ కన్వీనర్లు, కౌన్సిలర్లు, ఇన్ చార్జ్ లు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్ల, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.