వైభవోపేతంగా శ్రీ సరస్వతీ దేవి విగ్రహ ప్రతిష్ట..
1 min readపల్లెవెలుగు వెబ్ వల్లూరు: మండల పరిధిలోని గంగాయపల్లి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట వైభవోపేతంగా నిర్వహించారు, ప్రధానోపాధ్యాయులు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భోగ చిన్నయ్య సహకారంతో శ్రీ సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించామన్నారు, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వల్లూరు సర్పంచ్ తాడిగొట్ల శ్రీనివాసులు రెడ్డి. విద్య కమిటీ చైర్మన్ సుబ్బారెడ్డి, గ్రామంలోని ప్రజలు పాల్గొన్నారు, గురువారం వేద పండితుల చేత ఉదయం 7 గంటలకు గణపతి పూజ, సరస్వతి దేవికి జలాధివాసము, ధాన్యదివాసము, పంచామృత, అభిషేకము హోమము చేసి శ్రీ సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట చేశారు, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం తదనంతరం కార్యక్రమంకు వచ్చిన వారిని వేద పండితులు ఆశీర్వదించారు, వల్లూరు సర్పంచ్ తాడిగొట్ల శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ చదువుకునే విద్యాలయంలో శ్రీ సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట చేయడం అభినందనీయమన్నారు, ఆ సరస్వతి దేవి వలన ఈ పాఠశాల నందు ప్రతి ఒక్కరికి చదువుఅబ్బాలని చదువుకునే పిల్లలంతా గొప్పగా ఎదగాలని అన్నారు, విగ్రహ దాత శ్రీ భోగ చిన్నయ్య ను అభినందించారు, అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వల్లూరు మండలంలో మండల విద్యాశాఖ అధికారులు ఇద్దరు ఉన్నప్పటికీ మండల పరిధిలోని గంగాయపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టకు గైర్హాజరు.. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, నారాయణరెడ్డి, సుబ్బరామిరెడ్డి, గ్రామ పెద్దలు, ప్రజలు, వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ శ్రీనివాసులు, మండల పరిధిలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.