ఢిల్లీ సరిహద్దుల్లో రైతన్నల ఆందోళనకు మద్దతుగా రైతు సంఘాలు
1 min readపండించిన పంటకు కనీస మద్దతు ధర కోసం పోరాడుతున్న రైతులను చంపుతున్న బిజెపి ప్రభుత్వం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఢిల్లీ సరిహద్దుల్లో రైతన్నలు చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతుగా కేంద్ర కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీయూసీ నగర కార్యదర్శి జి చంద్రశేఖర్ సిఐటియు నగర కార్యదర్శి నరసింహులు అధ్యక్షతన ధర్నా జరిగింది. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మునెప్ప, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి అంజిబాబు, ఏఐయు టియుసి జిల్లా కార్యదర్శి నాగన్న, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగేంద్ర పంపన్న గౌడ్, ఏ కేస్ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ ము నెప్ప మాట్లాడుతూ రైతుల పండించిన పంటకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, స్వామినాథన్ కమిటీ.సిఫారసులను అమలు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం చేస్తున్న పోరాటాన్ని బిజెపి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీకి రైతులు రాకుండా పార మిలిటరీ దళాలతో ఉద్యమాన్ని ఉక్కుపాదంతో మనిషివేయడానికి రైతులపై భాస్వ వాయువులు ప్రయోగించి, సౌండ్ బాంబులు ప్రయోగించి,కాల్పులు జరుపుతూ వందల మంది రైతులు గాయపడ్డారని,యువరైతు శుభకరన్ సింగ్ చంపేయడం జరిగిందని ఇది ఒక దారుణమైన చర్యని, రైతులపై యుద్ధం చేసేటటువంటి పరిస్థితికి బిజెపి ప్రభుత్వం దిగజారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు.జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి అంజిబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు క్షమాపణ చెప్పి రైతులు పండించిన పంటకు కనీస భద్ర చట్టాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చి దాన్ని అమలు చేయాలని చేస్తున్న రైతుల పోరాటాన్ని వేయడానికి పాకిస్తాన్ వారితో యుద్ధం చేసినట్లుగా రైతులపై మిల్ట్రీ బలగాలని ఉసిగొలిపారని రైతులు అండగా ఉంటామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి దుర్మార్గమైన నాలుగు కార్మిక కోళ్లను తీసుకొని వచ్చి కార్మిక హక్కులను కాల రాస్తున్నారని ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానిక అంబానీ అప్పజెప్తూ దేశ సంపదను కొల్లగొడుతున్నారని దేశంలోని రైతులు కార్మికులు ప్రజలు వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు నడుము కట్టాలని వారు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ టి రామాంజనేయులు పురుషోత్తము సిఐటియు నాయకులు గోపాలు సుధాకర్ అప్ప రాధాకృష్ణ శ్రామిక మహిళా ఫోరం నాయకురాలు ఉమాదేవి రేణుక కృష్ణ ఏఐకేఎస్ నాయకులు సురేంద్ర కృష్ణ రేణుక తదితరులు నాయకత్వం వహించారు. అభివందనములతోఎస్ మునెప్ప ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి.