ప్రజల దాహార్తిని తీర్చిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ..
1 min readపల్లెవెలుగు వెబ్ వెలుగోడు: వెలుగోడు పట్టణానికి చెందిన మంచినీళ్ల బావి దర్గా సందు నందు సుమారు 50 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి 15 సంవత్సరాల నుండి వీరికి తాగడానికి నీళ్లు లేక ఎంతో అవస్థలు పడ్డారు గత ప్రభుత్వాలలోఎన్నిసార్లు రాజకీయ నాయకులకు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది, ఎన్నికలు వస్తే తప్ప ఎవరు ఆ సందును తొంగి చూసేవారు కాదు ఆ సమయంలో జగనన్న ప్రవేశపెట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా భారీ ఇంటి వద్దకే వచ్చిన శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి కి వారి యొక్క సమస్యనుతెలియజేయడం జరిగింది. ఆ సమయంలో శిల్పా చక్రపాణి రెడ్డి వారి సమస్యను నెరవేరుస్తారని హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా వారికిఎంపీపీ నిధుల ద్వారా పైపులైను ఏర్పాటు చేసి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించారు.ఈ సందర్భంగా ప్రజలు ఎంతమంది రాజకీయ నాయకులకు తమ సమస్యను చెప్పిన పరిష్కారం కాలేదు కానీ శ్రీ శిల్పా చక్రపాణి రెడ్డి కి చెప్పిన వెంటనే పైపులైను మంజూరు చేసి మా నీటి కష్టాలను పరిష్కరించినందుకు వారు హర్షం వ్యక్తం చేశారు, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశానుసారం ఈ పైప్ లైన్ ఏర్పాటుకు కృషిచేసినవెలుగోడు మండల ఎంపీపీ లాలం రమేష్ మరియు వెలుగోడు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వేల్పుల జైపాల్ కి ఏరియా వాసులు💐 కృతజ్ఞతలు💐 తెలుపుతూ వారికి సన్మానం చేయడం జరిగింది.