PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటర్ల జాబితా కు సంబంధించి వచ్చిన దరఖాస్తుల పరిష్కరిస్తున్నాం..

1 min read

పారదర్శకంగా అన్ని విషయాలు రాజకీయ పార్టీలకు తెలుపుతూ ఉన్నాం.

సి ఈ ఓ కు తెలియజేసిన జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాక్టర్ జి.సృజన.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఓటర్ల జాబితా కు సంబంధించి వచ్చిన దరఖాస్తుల పరిష్కరిస్తున్నామని, పారదర్శకంగా అన్ని విషయాలను  రాజకీయ పార్టీలకు తెలియచేస్తున్నమని సి ఈ ఓ కు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాక్టర్ జి.సృజన వివరించారు…శుక్రవారం రాష్ట్ర చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా విజయవాడ నుండి  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో ఫార్మ్స్ డిస్పోజల్, ఎన్నికల సన్నద్ధత అంశాలపై  సమావేశం నిర్వహించి జిల్లాలలో జరుగుతున్న ఏర్పాట్లపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ డాక్టర్ జి సృజన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కి వివరిస్తూ…గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు   స్ట్రాంగ్ రూమ్ విషయాలు , ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ల వివరాలు , వచ్చిన కంప్లైంట్స్ వివరాలు , దినపత్రికలో వచ్చిన వ్యతిరేక వార్తలు పై తీసుకున్న చర్యల వివరాలను పారదర్శకంగా  ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామన్నారు.కర్నూలు జిల్లాకు కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలు సరిహద్దులు గా ఉన్నాయని, వీటిపై నిరంతరం నిఘా ఉంచామని , ఇంతవరకు 7 కోట్ల 18 లక్షల రూపాయలు నగదు స్వాధీన పరచుకున్నామని , కొద్ది మొత్తంలో లిక్కర్ కూడా స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు ..దినపత్రికలలో వచ్చిన  మండలాలకు సంబంధించిన 152 కంప్లైంట్స్ పరిష్కరిస్తున్నామని తెలిపారు.ఫార్మ్స్ డిస్పోజల్ పై ప్రత్యేక దృష్టి పెట్టామని, త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేషనల్ హైవే ను ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఆర్ వో గా కేటాయించగా ఆయన విధుల్లో చేరనందున వేరొకరికి నియమించడానికి అనుమతి కోసం ప్రపోజల్ సమర్పించడం జరిగిందని తెలిపారు.పాణ్యం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించిన రెండు మండలాలు పాణ్యం మరియు గడివేముల నంద్యాల జిల్లాలో ఉన్నందున ఎన్నికల సిబ్బంది ఆ రెండు మండలాల నుండి కూడా తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలియజేశారు.

About Author