ఘనంగా అమరజీవి కామ్రేడ్ చదువుల రామయ్య 32వ వర్ధంతి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో పోరాట యోధులు అమరజీవి కామ్రేడ్ చదువుల రామయ్య 32వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్నూలు నగర నిర్మాణ సహాయకులు కామ్రేడ్ కే జగన్నాథం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మునెప్ప సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని వారు చదువుల రామయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జగన్నాథం మాట్లాడుతూ 1976 77 సంవత్సరం నుండి 1992 దాకా భారత కమ్యూనిస్టు పార్టీ cpi కర్నూలు జిల్లా కార్యదర్శిగా పనిచేసిన సందర్భంగా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడైనకోట్ల విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకుడిగాకేఈ మాదన్న ల పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా పనిచేసి కమ్యూనిస్టు పార్టీని గ్రామ గ్రామాన జిల్లా పార్టీ విస్తరించడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఫ్యాక్షన్ కక్షలకు వ్యతిరేకంగా పదుల సంఖ్యలో కమ్యూనిస్టు పార్టీ నాయకులను కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ వారు ఆనాడు హత్యలు చేస్తూ ఉంటే తట్టుకొని నిలబడి పార్టీ నాయకుల కు కార్యకర్తల కు ధైర్యం కోల్పోకుండా దాడికి ప్రతి దాడి అనే విధంగా పార్టీ కార్యకర్తలను కాపాడుకొని అక్కున చేర్చుకున్న నాయకుడు పోరాట యోధుడు మరో మాస్కో గా మారెళ్ళ గ్రామానికి పేరు తీసుకొచ్చిన కామ్రేడ్ చదువుల రామయ్య ఇప్పుడు ఉన్నటువంటి యువతకు ఆదర్శం కావాలని ఆయన పోరాటాలు స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్న కమ్యూనిస్టు నాయకులు పనిచేయాలని మొలగ వెళ్లి తిర్నాంపల్లె గుండాల కొంగనపల్లె లాంటి అనేక గ్రామాలలో భూమిలేని ప్రతి పేదోడికి భూమి పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకుడు కామ్రేడ్ చదువుల రామయ్య గారనీ అలాంటి నాయకుడు ప్రజల మధ్య లేకుండా పోయి 32 సంవత్సరాలు అవుతుంనప్పటికీ ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి ఘనంగా నిర్వహించుకుంటూ రాబోవు తరాలకు అందిస్తూ ముందుకు సాగుతోంది భారత కమ్యూనిస్టు పార్టీ అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు నాగరాజు మాజీ కార్పొరేటర్ గిడ్డమ్మ ఈశ్వర్ అన్వర్ శివ ప్రసాద్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాసులు డి హెచ్ పి ఎస్ నగర కార్యదర్శి రామచంద్ర రైతు సంఘం జిల్లా కౌన్సిల్ నెంబర్ సురేంద్ర నగర నాయకులు రసూలు మల్లికార్జున మహబూబ్ మహిళా నాయకులు శైలజ వెంకటేశ్వరమ్మ సులోచనమ్మ నాగేంద్రమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.