అభాగ్యులకు ఆదరణ చూపించిన ఎస్ఐ హృషికేశవరెడ్డి..
1 min read
పల్లెవెలుగు వెబ్ కమలాపురం: కమలాపురం పట్టణములోని అభాగ్యులకు ఆదరణ చూపించిన కమలాపురం ఎస్ఐ హృషికేశవరెడ్డి, ఎటు వెళ్లాలో తెలియక రోడ్ల పైన ఉంటూ నడవలేని పరిస్థితిలో ఉన్న ఒక అభాగ్యుడిని, అలాగే కమలాపురం పట్టణంలో ఒంటరిగా జీవిస్తు అనారోగ్యంతో బాధపడుతున్న మరో వ్యక్తితో ఇద్దరినీ కమలాపురం పట్టణంలోని అభి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎన్ విజయబాబు సహకారంతో ఎద్దుల పెద్ద శేషమ్మ వృద్ధాశ్రమంలో చేర్పించిన ఎస్సై, ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అభాగ్యులకు యాచకులకు ఎంతోమందికి సహాయపడుతున్న వృద్ధాశ్రమం యాజమాన్యం ను అలాగే అన్ని విధాల సహకరిస్తున్న అభి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ను అభినందించారు, ఇలాంటి వారికి సేవ చేయడం అభినందనీయమన్నారు,ఈ కార్యక్రమంలో వాలంటరీ శ్యామ్,తదితరులు పాల్గొన్నారు.