పెన్నా నదిలో చుక్కనీరు లేక రైతులు అవస్థలు
1 min readనీటి కోసం అలమటిస్తున్న పశువులు. గొర్రెలు మేకలు.
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు ఎగువ ప్రాంతం నుంచి పెన్నా నదికి నీరు రావడం ఆగిపోవడంతో చుక్కనీరు లేకుండా చెన్నూరు వద్ద పెన్నా నది ఎడారిలా మారింది. ఫిబ్రవరి నెల ఐదో తేదీ నుంచి ఎగువ ప్రాంతం నుంచి పెన్నా నదికి నీటి ప్రవాహం నిలిచిపోయింది. చెన్నూరు మండలం కొక్కరాయపల్లి. చెన్నూరు. కొండపేట. కనుపర్తి. బలిసింగాయపల్లి. నజీర్ బేకుపల్లి. గుర్రంపాడు. ఓబులంపల్లి. గ్రామ ప్రాంతాల్లో పెన్నా నది పూర్తిగా ఎండిపోయింది. దీని కారణంగా పెన్నా నది పరివాహక ప్రాంతం వెంబడి రైతులు సాగుచేసిన పంట పొలాలకు బోర్ల నుంచి నీరు అందకుండా పోతున్నది. రైతులు పెన్నా నదిలో వేసిన బోర్లను తొలగిస్తున్నారు. మరి కొంతమంది రైతులు లోతుగా బోర్లను తవ్వుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో త్రాగునీటి బోర్లలో కూడా నీరు అడుగంటడంతో త్రాగునీటి బోర్లు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. పెన్నా నదిపై ఆధారపడి జీవిస్తున్న రజకులు నీరు లేకపోవడంతో వారి పరిస్థితి దైనింగా మారింది. బట్టలు ఉతకడానికి ఇబ్బందులు పడుతున్నారు. పెన్నా నదిలోకి వచ్చే పశువులు మేకలు గొర్రెలకు త్రాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది. పెన్నా నది ఎగువ భాగంలో మైలవరం. గండికోట జలాశయాల్లో నీరు ఉన్నప్పటికీ పెన్నా నదికి నీరు వదలడం లేదు. గండికోట. మైలవరం జలాశయాల నుంచి పెన్నా నదికి నీరు వదలాలని పెన్నా నది పరివాహక ప్రాంత రైతులు ప్రజలు కోరుతున్నారు.