ఏపీ రాష్ట్ర ఉప-లోకాయుక్తగా శ్రీమతి పి.రజని ప్రమాణ స్వీకారం
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప-లోకాయుక్తగా శ్రీమతి పి.రజని ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం స్థానిక సంతోష్ నగర్ లోకాయుక్త కార్యాలయంలో శ్రీమతి పగిడి రజని చేత జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు, బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీమతి పగిడి రజని ని వేద పండితులు ఆశీర్వదించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి జీవో ఎం.ఎస్.నెం.15 తేది 19.02.2024 ఉత్తర్వుల ప్రకారం శ్రీమతి పి.రజని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప- లోకాయుక్త గా నియమితులయ్యారు. సదరు ఉత్తర్వుల ప్రకారం కర్నూలు లోని లోకాయుక్త సంస్థ కార్యాలయము లో ఫిబ్రవరి 24 వ తేది శనివారం ఉదయం గౌరవ ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి ఎదుట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప-లోకాయుక్త గా శ్రీమతి పి.రజని ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.
