డోన్ తహశీల్దార్ ని.. సత్కరించిన బిజెపి యువ నాయకులు
1 min readపల్లెవెలుగు వెబ్ డోన్: నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని డోన్ పట్టణంలో బదిలీల ప్రక్రియ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.దాదాపుగా 2024 ఎన్నికల సందర్భంగా ఈ ప్రక్రియ పూర్తి అయ్యిందని చెప్పొచ్చు .బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ గతంలో డోన్ పట్టణము తహశీల్దార్ విద్యాసాగర్ బదిలీపై వెళ్ళడంతో నూతన తహశీల్దార్ గా పులివెందులలో పనిచేసిన మాధవ కృష్ణా రెడ్డి రావడం జరిగింది. పులివెందులలో తహశీల్దార్ గా ప్రజా సంక్షేమం కోసం కృషి చేసిన మాధవ కృష్ణా రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించడం జరిగింది.డోన్ లో ఉన్నటువంటి స్థానిక సమస్యల పరిష్కారం కోసం మండల మేజిస్ట్రేట్ గా మీ వంతు బాధ్యత గా కృషి చేయాలని కోరడం జరిగింది అలాగే నూతన తహశీల్దార్ మాధవకృష్ణారెడ్డికి డోన్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను వివరించాను అని పేర్కొన్నారు ముఖ్యంగా డోన్ మండలంలోని పట్టణం, గ్రామాల్లో ప్రజల తాగునీటి అవసరాలకు సరిపడా నీళ్లు వచ్చేలా రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకునేలా చేయాలని కోరారు. ముఖ్యంగా రెవెన్యూ అంశాలకు సంబంధించి పొలాల సరిహద్దులు గుర్తించడంతో పాటు, పొలాల సర్వేను పకడ్బందీగా అమలు చేసి ,రైతాంగానికి ఇబ్బందులు లేకుండా ఆన్ లైన్ పేర్ల నమోదు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొనే ప్రధానమైన సమస్య అయిన రస్తదార్లకు సంబంధించిన వివాదాలకు పరిష్కారాలు లభించేలా పొలాల సర్వే పటిష్టంగా నిర్వహించి తద్వారా దేశానికి అన్నం పెట్టే రైతులకు అండగా నిలబడాలని తహశీల్దార్ మాధవ కృష్ణా రెడ్డిని కోరడం జరిగిందని మీడియాకు తెలిపారు .సానుకూలంగా స్పందించిన తహశీల్దార్ కు బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున ధన్యవాదాలు తెలిపారు.