వాహనాల తనిఖీ..కేసులు నమోదు:ఎస్ఐ
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని నందికొట్కూరు-నంద్యాల ప్రధాన రహదారి బ్రహ్మంగారి మఠం దగ్గర శనివారం సాయంత్రం సిబ్బందితో కలిసి మిడుతూరు ఎస్ఐ ఎం జగన్ మోహన్ వాహనాలను తనిఖీ చేశారు.వాహనాలకు సరైన పత్రాలు ఉన్నాయా లేదా అని పరిశీలించి అదేవిధంగా వాహనదారులకు లైసెన్సు లేని వారికి ఆరు మందిపై కేసులు నమోదు చేసి 16 వందల రూపాయలు జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు అదే విధంగా మద్యం సేవించి వివాహనాలు నడుపుతున్న వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఆటోలో అధికలోడుతో ప్రయాణికులను ఎక్కించుకో రాదని అదేవిధంగా వాహనాలకు తప్పనిసరిగా పత్రాలు ఉండాలని హెల్మెట్ వాడటం వల్ల రక్షణగా ఉంటుందని ఎస్సై వాహనదారులకు సూచించారు.నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది మాభాష తదితరులు ఉన్నారు.