PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించరాదని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, బాలసాయి కంటి ఆసుపత్రి, మెడికేర్ క్లినిక్, అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కర్నూల్ గ్రేటర్ క్లబ్ ల సంయుక్త ఆధ్వర్యంలో కర్నూల్ నగరంలోని గురు రాఘవేంద్ర నగర్ లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు,ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలను అందించడంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్  మెల్విన్ జోన్స్ సంస్థ తరఫున సహకారాన్ని అందిస్తామన్నారు. విశ్వ భారతి మెడికల్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగపరచుకోవాలన్నారు. అనంతరం అలంపూర్ సమీపంలోని ఇటిక్యాల గ్రామంలో జరిగిన వైద్య శిబిరంలో  మెడికేర్  క్లినిక్ కు చెందిన డాక్టర్ ఫరీదా, బి. రాజేశ్వరి ,సోమన్న, శ్రీనివాసులు ఆర్.ఎం.పి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.  ఉచిత బీ.పీ, షుగర్ మరియు జనరల్ ఫిజీషియన్ సంబంధిత వ్యాధులకు నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. రెండు వైద్య శిబిరాలలో కలిపి మొత్తం 150 మందికి పైగా నిరుపేదలకు వైద్య సేవలను అందించారు.

About Author