డి ఎస్సీ-2024 లో ఉర్దూ ఉపాధ్యాయుల ఖాళీలన్ని భర్తీ చేయండి..
1 min readరాష్ట్ర ఉర్దూ టీచర్ అసోసియేషన్..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖాళీగా ఉన్న ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులన్నింటిని భర్తీ చేయాలని , డీఎస్సీ నోటిఫికేషన్ లో పోస్ట్లు చాలా తక్కువగా చూపించారని రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ (రూట) రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుర్ రఖీబ్ పాణ్యం ఎం ఎల్ ఏ కాటసాని రామ్ భూపాల్ రెడ్డి కు వినతి పత్రం అందజేశారు.జిల్లాలోని గడివేముల మండలం, బిల్కల గూడూరు గ్రామం లో జరిగిన సభ లో ఎం ఎల్ ఏ కాటసాని రామ్ భూపాల్ రెడ్డి కలిసి సయ్యద్ అబ్దుర్ రఖీబ్ మాట్లాడుతూ ఉర్దూ ఉపాధ్యాయులు లేక జిల్లా వ్యాప్తంగా ఉర్దూ పాఠశాలలు మూతపడుతున్నాయని, జిల్లాలో దాదాపు వెయ్యి మంది ఉర్దూ డీ ఎస్సీ అభ్యర్థులు మెగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తూన్నారని, వారు నిరుత్సాహపడకుండా చూడాలని,ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులన్నింటిని భర్తీ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉర్దూ ఉపాధ్యాయులు , డీఎస్సి అభ్యర్థులు పాల్గొన్నారు.