శ్రీ మద్ది ఆంజనేయ స్వామి సన్నిధిలో జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ అధికారి
1 min readప్రత్యేక దర్శనం,ఆలయ మర్యాదలతో సత్కరించిన ఈవో ఆకుల కొండలరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్వామివారిని దర్శించుకొన్న జంగారెడ్డిగూడెం నూతన డి.ఎస్.పి. అనంతరం భాద్యతల స్వీకరణ జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయమువద్ద శనివారం సందర్భముగా శ్రీస్వామివారి దృవమూర్తికి అర్చక స్వాములు పంచామృత అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించినారు. సదరు అభిషేక ప్రక్రియలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నూతన సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా నియమితులైన రవిచంద్ర మొదట స్వామివారి దర్శనం చేసుకొని తదుపరి భాద్యతలు స్వీకరించడానికి జంగారెడ్డిగూడెం వెళ్లారు. తొలిత వారిని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ ధర్మకర్తలు మల్నీడి మోహనకృష్ణ(బాబీ), మానికల బ్రహ్మానందరావు, చిలుకూరి సత్యనారాయణ రెడ్డి, పర్యవేక్షకులు కురగంటి రంగారావుల పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అద్యక్షురాలు శ్రీమతి సరిత విజయభాస్కర్ రెడ్డి మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెల్పినారు.