ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగుర వేద్దాం..
1 min readకేంద్రంలో మరొక్కసారి బిజెపి మోడీకే మన ఓటు@మిషన్ 2024 బైక్ ర్యాలీ…
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా:బీజేపీ సర్కార్ లోనే దేశానికి భద్రత, మహిళలకు రక్షణ ఉండడంతో పాటు, అఖండ హిందూ భారతదేశం మోడీతోనే సాధ్యం అని భారత్ భవిష్యత్ లో విశ్వగురు స్థానానికి చేరుకుంటుంది అని ప్రపంచ దేశాలు పేర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. దేశ ప్రధానిగా మరోసారి నరేంద్ర మోడీ కావాలని,#MY VOTE FOR NATION#MY VOTE FOR MODI మరియు #MISSIONMODI2024 హ్యాస్ ట్యాగ్ ఫ్లకార్డులతో లీగల్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. లీగల్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ప్రధాన కార్యదర్శి మందా రాజ్యలక్ష్మి తమిళనాడు రాష్ట్రం మధురై నుండి బైక్ యాత్ర చేపడుతున్నారు. ఈ బైక్ యాత్ర ఇప్పటి వరకు తమిళనాడు, కర్ణాటక , తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా లో పూర్తి చేసుకొని రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. యాత్ర 21000కి.మి. 65 రోజుల పాటు 15 రాష్ట్రాల మీదుగా సాగి ఏప్రిల్ 18న ఢిల్లీ చేరుకొని అక్కడ ముగుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మందా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ బీజేపీ సర్కార్ లోనే దేశానికి భద్రత సాధ్యమని, మహిళలకు రక్షణ, అఖండ హిందూ భారతదేశం మోడీతోనే సాధ్యమని అందుకే మరో సారి నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి, ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగుర వేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లీగల్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చింతలపల్లి రామకృష్ణ, ఉపాధ్యక్షులు కోనేటి వెంకటేశ్వర్లు, రామకృష్ణ స్కూల్ కరస్పాండెంట్ చింతలపల్లి విజయలక్ష్మి, కర్నూలు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి భరత్, నంద్యాల జిల్లా బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున, కురువ ఈశ్వర్, నారాయణ స్వామి, సీనియర్ అడ్వకేట్స్ గురు ప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.