పద్మశాలీలు.. ఉత్తమ సేవకులు..
1 min readపదవీ విరమణ పొందిన 17 మందికి POPA ఆధ్వర్యంలో ఘన సన్మానం
- మీ అనుభవం… భావితరాలకు ఉపయోగపడాలని సూచించిన ఎంపీ డా. సంజీవ్ కుమార్
కర్నూలు, పల్లెవెలుగు: రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ… ఇటీవల పదవీ విరమణ పొందిన పద్మశాలీల కుటుంబ సభ్యులను ఆదివారం కర్నూలు పద్మశాలీ అఫిషియల్స్ మరియు ప్రొఫెషనల్స్ అసోసియేషన్( POPA) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నగరంలోని ఆయుష్మాన్ హాస్పిటల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ డా. సంజీవ్ కుమార్ పదవీ విరమణ పొందిన 17 మందికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పదని, కానీ పదవీ విరమణ తరువాత మీ అనుభవం.. ఆలోచనలు, సేవలు.. భావితరాలకు ఉపయోగపడాలని సూచించారు. ప్యాపిలి చంద్రశేఖర్, పద్మశాలి అధ్యక్షులు కస్తూరి వేమయ్య , మరియు popa సభ్యులు, Dr. శింగరి గంగాధర్,Dr. యస్.అచ్యుతరావు,N.కేశవయ్య, కాకర్ల శేషాద్రి,కస్తూరి ప్రసాద్ క, కార్యదర్శి గోవిందు, మేడం సుంకన్న,,శిరిసాల లక్ష్మీనారాయణ, జేరుబండి హరిప్రసాద్, దండు శ్రీహరి, పులిపాటి జగన్ , కాల్వ సంజీవ్,B.శ్రీనివాసులు అడ్వకేట్ గుద్దేటివేణు,బోగారామయ్య Z.P.ఆంజనేయులు,శ్రీసోమనాథ్ లెక్చరర్ తదితరులు పాల్గొన్నారు.
కృతజ్ఞతలు..
కర్నూలు పద్మశాలీ అఫిషియల్స్ మరియు ప్రొఫెషనల్స్ అసోసియేషన్( POPA) కు ఎనలేని సేవలు చేసిన డైరెక్టర్స్ కాకర్ల శాంతి కుమార్, బోడా రమేష్ (ప్యాపిలి)కు పద్మశాలి అధ్యక్షులు కస్తూరి వేమయ్య , సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వీరు సేవలు కొనసాగిస్తూ… పోపాను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సభ్యులు ఆకాంక్షించారు.