PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు జీజీహెచ్​లో హెచ్​ఓడీ లతో సమీక్ష సమావేశం

1 min read

అడిషనల్ DME & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి,  మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధనవంత్రి హాల్ లో వివిధ విభాగాల HODs తో ఆరోగ్యశ్రీ మరియు ఈ హాస్పటల్ లపై సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.ఆరోగ్యశ్రీ :—-ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ  పలు విభాగలైన గ్యాస్ట్రో ఎంటర్రాలజీ మరియు జనరల్ మెడిసిన్, సిటివిఎస్, మెడికల్ ఆంకాలజీ, న్యూరాలజీ, ఆర్తో, పీడియాట్రిక్, సైకియాట్రి, పల్మానాలజీ విభాగాలలో టార్గెట్ ను రీచ్ అయిన విభాగాలకు ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు.ఈ హాస్పిటల్ :-ఆసుపత్రిలో పలు విభాగాలలో ఈ హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్ CTVS , ఎండోక్రైనాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, ఫ్యామిలీ ప్లానింగ్ డిపార్ట్మెంట్లలో ఈ హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్ చేయాలని సూచించారు.  ఆస్పత్రిలోని ఈ హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్ వచ్చిన అమౌంట్ లో HDS అకౌంట్లో జమ అయినా అని తెలియజేశారు.

పలు విషయాలపై సమీక్ష :

ఆసుపత్రిలో  ఈహెచ్ఎస్ ఓపీ గురించి ఆరా తీశారు  ఆసుపత్రికి వచ్చే ఈహెచ్ఎస్ పేషెంట్లకు  మెరుగైన వైద్య సేవలు అందించాలని అనంతరం అసిస్టెంట్ ప్రొఫెసర్ చూసేలా చర్యలు తీసుకోవాలని సంబంధించిన హెచ్చోడులను ఆదేశించారు.ఆసుపత్రిలోని ఎస్ఎల్ డయాగ్నస్టిక్ సెంటర్ కు ఈనెలాఖరు గడువు ముగియానున్నట్లు తెలియజేశారు. అనంతరం సిటీ స్కానింగ్ సంబంధించి కేసులను న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ లో పంపించాలని హెచ్చోడిలకు ఆదేశించారు.ఆస్పత్రిలోని ల్యాబ్ కు పంపించే  రిక్వెషన్ ఫామ్ లో పలు ఓపి మరియు ఐపి కేసుల సంబంధించిన UHID 11 అంకెల నంబర్ ను ప్రాపర్ గా ఎంటర్ చెయ్యాలని సంబంధించిన హెచ్చోడి లకు తెలియజేశారు.ఆసుపత్రిలోని డెత్ రిపోర్ట్ ల గురించి డిలే ఐతున్న సందర్భంగా తత్వార గా  రిపోర్టులను పంపించాలి అనంతరం డెత్ సమ్మరీ లో అన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అనంతరం సంబంధించిన హెచ్వోడి సిగ్నేచర్ ఉండేలా చూడాలని హెచ్చోడిలను ఆదేశించారు.ఆసుపత్రిలోని న్యూరాలజి స్ట్టోక్ యూనిట్ ఐసీయూలలో మెడికల్ పీజీ లను నియమించాలని సంబంధించిన హెచ్చోడిను ఆదేశించారు.ఆస్పత్రిలో  క్యాజువల్టి విభాగంలోని పేషెంట్లకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందుబాటులో ఉండి పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమానికి  కర్నూలు  వైద్య కళాశాల అడిషనల్ DME & ప్రిన్సిపాల్,  డా.సుధాకర్, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డా.ప్రభాకర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్, డా.శ్రీహరి, ఆసుపత్రి CSRMO, డా.వెంకటేశ్వరరావు, డిప్యూటీ CSRMO, డా.హేమమాలిని, హెచ్వోడీస్, డా.రాజశేఖర్, డా.కొండరెడ్డి, డా.సీతారామయ్య, డా.శ్రీనివాసులు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, తదితరులు పాల్గొన్నట్లు, అడిషనల్ DME & సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, తెలిపారు.

About Author