బైరెడ్డి నగర్ లో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు
1 min readకౌన్సిలర్ కృష్ణవేణి చొరవతో నూతన మంచినీటి బోరు ఏర్పాటు.
బైరెడ్డి నగర్ లో మంచి నీటి బోరు ప్రారంబించిన మున్సిపల్ చైర్మన్.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీ లోని బైరెడ్డి నగర్ ప్రజలకు నీటి సమస్య తలెత్తకుండా కౌన్సిలర్ కృష్ణవేణి చొరవతో ఏర్పాటు చేసిన నూతన మంచినీటి బోరు ను మంగళవారం మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ప్రారంభించారు.ప్రజల దాహార్తిని తీర్చేందుకు నీటి ఎద్దడి ఏర్పడకుండా పట్టణంలోని బైరెడ్డి నగర్ నందు నీటి సమస్య పరిష్కారం కోసం శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి దృష్టికి కౌన్సిలర్ కృష్ణవేణి తీసుకెళ్లారు.సిద్దార్థ రెడ్డి ఆదేశాలతో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన బోరు వేయించడం జరిగింది. మంచి నీటి బోరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి , కౌన్సిలర్ కె.క్రిష్ణవేణమ్మ , వైసిపి నాయకులు వార్డు ఇంచార్జి బ్రహ్మయ్య ఆచారి పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి బోరు ను ప్రారంభించారు. నీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ లకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మనోజ్ రెడ్డి, కౌన్సిలర్ లాలు ప్రసాద్, వార్డు ప్రజలు రాజు, మల్లెల హరి, నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఆశన్నగారి మధు తదీతరులు పాల్గొన్నారు.