నేడే నూతన పార్కు ప్రారంభం…
1 min readఏబీఎం పాలెంలో రూ.40 లక్షల తో పార్కు నిర్మాణం.
జై బీమ్ పార్కుగా నామకరణం చేయనున్న అధికారులు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీ ఏబీఎం పాలెం నందు రూ. 40 లక్షల తో నూతనంగా నిర్మించిన పార్కును కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి , వైస్ చైర్మన్ ఆర్షపోగు ప్రశాంతి , నందికొట్కూరు వైసీపీ సమన్వయ కర్త ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ ధారా లు ముఖ్య అతిథులుగా హాజరై బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కౌన్సిలర్ కాటేపోగు చిన్న రాజు మంగళవారం కోరారు. నందికొట్కూరు మున్సిపాలిటీ లోని ఏబీఎం పాలెం లో పార్కు నిర్మాణం కోసం కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కూడా ) రూ.40 లక్షల తో పార్కు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. దాదాపు 42 సెంట్ల స్థలంలో దసరా పండగ వేళ అక్టోబర్ 24 న పనులు ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
5నెలల్లో ఏబియం పాలెం పార్కు నిర్మాణం పూర్తి.
కుడా సహకారంతో శాప్ చైర్మన్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కృషి తో రూ.40 లక్షల వ్యయంతో
నందికొట్కూరు పట్టణంలోని ఏబియం పాలెం నందు అత్యంత సుందరంగా పార్కు నిర్మాణం ఐదు నెలల్లోనే పూర్తి చేయడం జరిగింది. మంగళవారం. కౌన్సిలర్ చిన్నరాజు ఆధ్వర్యంలో పూర్తైన పార్కు ను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి పరిశీలించారు.యుద్ధప్రాతిపదికన పార్కు పనులు పూర్తి కావడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.నందికొట్కూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధికి శ్రీకారం చుట్టి యుద్ద ప్రాతిపదికన పార్కు నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని అన్నారు.బుధవారం ఫిబ్రవరి 28న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో పార్కు ప్రారంభోత్సవం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.మున్సిపాలిటీ లోని అన్ని వార్డు లను అభివృద్ధి పథంలో నడిపించడమే మా ధ్యేయం, రాజకీయ చరిత్రలో కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడం ఒక్క జగనన్నకే సాధ్యం అని అన్నారు.మున్సిపల్ కౌన్సిలర్లు , అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ బొల్లెద్దుల రామక్రిష్ణ, వైస్ ఎంపీపీ నబి రసూల్, రామిరెడ్డి తదీతరులు పాల్గొన్నారు.