విప్లవ పార్టీల ఐక్య మహాసభను జయప్రదం చేయండి..!
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మతతత్వ బి.జె.పి. ఆర్.యస్.యస్. సంఘ్ పరివారు జై భజరంగదళ్ లాంటి ఫాసిస్టు శక్తులను ఓడించడానికి భారతదేశవ్యాప్తంగా ఉన్న 3 విప్లవపారీలు సిపిఐ (యంయల్), ప్రజాపంథా సిపిఐ (యంయల్), ఆర్ ఐ పిసిసి సిపిఐ (యంయల్) పార్టీలు ఐక్యమై సిపిఐ (యంయల్), మాస్ లైన్ (ప్రజాపంథా), విప్లవ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో మార్చి 3వ తేదిన యూనిటి మహాసభ ద్వారా ఆవిర్భవిస్తుందన్నారు. ఈ సందర్భంగా సిపిఐ (యంయల్) మాస్ లైన్((ప్రజాపంథా) పోస్టల్ను నంద్యాల జిల్లా నందికొట్కూరు పార్టీ ఆఫీసు నందు విడుదల చేయడమైనది. ఈ సందర్భముగా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వేల్పుల అర్లప్ప మరియు ఐఎన్టియు జిల్లా నాయకులు టి. తిరుపాలు, యన్. రమేష్లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రాజ్యాంగము ద్వారా రాష్ట్రాలకు సంక్రమించిన పెడరల్ హక్కుల్ని కాలరాస్తున్నది. అంతేకాదు బిజెపి, ఆర్యస్యస్ సంఘ్ పరివార్ శక్తులకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలను ప్రజాస్వామిక లౌకికశక్తులను అణచిపెడుతున్నది. అందుకోసము రాష్ట్రపాలన యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటున్నది. అంతటితో చాలక పార్లమెంటరీ సంస్థలైన సిబిఐ, ఈడి, ఐటి తదితర సంస్థల ద్వారా దాడులు చేస్తున్నది. ఢిల్లీ సరిహద్దులో శంబు బార్డర్ దగ్గర రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్దత చేయాలని రైతుల పంట రుణాలన్ని మాఫీ చేయాలని రైతాంగ ఉద్యమంలో మరణించిన వారికి ఎక్స్రేసియా ప్రకటించాలని డాక్టర్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని తదితర డిమాండులతో 14రోజుల నుండి శాంతియుతంగా ధర్నాచేస్తున్న రైతాంగముపై మోడీ ప్రభుత్వం నిరంకుశంగా రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపి 21 సంవత్సరములు శుభకరణాసింగ్ అనే యువ రైతును చంపించడమైనది. మరియు 160 మంది రైతులు గాయాలపాలలై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. కనుక ఇప్పటికైనా మోడి ప్రభుత్వం కార్పోరేట్ల ప్రయోజనాలు మాని దేశానికి అన్నం పెట్టుచున్న రైతుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని లేని పక్షంలో భారి ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించడమైనది. ఈ కార్యక్రమంలో ఎఐపికేయంయస్ నాయకులు వేల్పుల మనోహర్, చెన్నయ్య, మాబాషా, బలరాముడు తదితరులు పాల్గొన్నారు.