మండలంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
1 min readజడ్.పి.హెచ్.ఎస్, లిటిల్ ఏంజిల్, దేరిసా పాఠశాలలో వేడుకలు
పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: వెలుగోడు జాతీయ సైన్స్ దినోత్సవం వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ రావు లిటిల్ ఏంజెల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పాఠశాలక రెస్పాండెంట్ డాక్టర్ ఎంఎఫ్ ఇమ్మానియేల్ తెరిసా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు అతావుల్లా భాష లు జాతీయ శాస్త్రవేత్తపూలమాలలు వేసి ఘనంగాన్ని వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా ఆయా పాఠశాల విద్యార్థు లకు నిర్వహించిన వ్యాసరచన, వక్త్రత్వపు పోటీల విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయా పాఠశాలలో విద్యార్థులు సైన్స్ ప్రాజెక్ట్లను తయారుచేసి ప్రదర్శించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ రావు లిటిల్ ఏంజెల్స్ కరస్పాండెంట్ ఎం ఎఫ్ ఇమ్మానియేల్ తెరిసా పాఠశాల ప్రధానోపాధ్యాయు డు అతావుల్లా భాష లు మాట్లాడుతూ వినూత్నశాస్త్ర పరిశోధనలు దేశ ప్రగతికి మెరుగైన, సౌకర్యవంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించడానికి దేశ రక్షణకు ఎంతో ఉపయోగకరం అని అన్నారు. ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా జిల్లా సైన్సు కోఆర్డినేటర్ శ్రీ సుందర్ రావు , జిల్లా సైన్సు అబ్జర్వర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని మెచ్చుకొని, విద్యార్థుల్ని విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు రవిశంకర్ రావు ,ఇతర సైన్స్ ఉపాధ్యాయులు మరియు మహమ్మద్ ఫైజుల్లా, మొయినుద్దీన్, ఏవో ప్రశాంత, అనిల్ ,సలీం, నూరుల్ అమిన్ మురళి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.