విద్యార్థులకు వృత్తి విద్యలో శిక్షణ
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో ఉన్న ఏపీ మోడల్ పాఠశాలలో చదువుతున్న 9,10 వ తరగతి విద్యార్థులకు ఐటి-ఐటియస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వృత్తి విద్యలో శిక్షణ ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ సలీం భాష తెలిపారు. బుధవారం మధ్యాహ్నం మిడుతూరు సచివాలయాన్ని విద్యార్థులు సందర్శించారు.ఈ సందర్భంగా సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ తులసి, మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ మధు సహాయంతో విద్యార్థులకు సచివాలయ విధులు కంప్యూటర్ టెక్నాలజీ ప్రాముఖ్యత గురించి వారు విద్యార్థులకు తెలియజేశారు. మరియు విద్యతో పాటు వృత్తి విద్యలో కూడా రాణించాలని విద్యార్థులకు తెలిపారు.వృత్తి విద్య ప్రాధాన్యతను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వృత్తి విద్య ఉపాధ్యాయులు వీరెష్, రహిమున్నిసా,పాఠశాల ఉపాధ్యాయులు గోవిందు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.