విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకతను వెలికి తీయాలి
1 min read-భాష్యం స్కూల్లో ఘనంగా సైన్స్ దినోత్సవ వేడుకలు
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో భాష్యం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో భాష్యం స్కూల్స్ రాయలసీమ జోన్ సీఈవో అనిల్ కుమార్ ఆదేశాల మేరకు బుదవారం ప్రిన్సిపాల్ మాచాని కవిత అద్వర్యంలో ఘనంగా జాతీయవిజ్ఞాన దినోత్సవం జరపుకున్నారు.. ఈ సైన్స్ దినోత్సవానికి ముఖ్య అతిథిలుగా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్మల్లికార్జున, మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు హాజరయ్యారు. ప్రిన్సిపాల్ మాచాని కవితతో కలసి విద్యార్ధుల ప్రయోగ ప్రదర్శనను వారు పరిశీలించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థులు ప్రతి విషయాన్ని సొంతంగా ఆలోచించి తమలో దాగివుని నైపుణ్యాలను వెలికి తీయాలని సూచించారు. దేశం అభివృద్ధి సాధించాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో దేశం పురోగమించాలని తెలిపారు. ప్రిన్సిపాల్ మాచాని కవిత మాట్లాడుతూ ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్న ఎఫెక్ట్ కనుకోవడంతో ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవం గా జరుపుకుంటామని తెలిపారు. భౌతిక శాస్త్రంలో రామన్ చేసిన అపారమైన సేవలను గుర్తింపుగా జాతీయ సైన్స్ దినోత్సవం గా ప్రభుత్వం ప్రకటి ప్రకటించిందని చెప్పారు. ప్రయోగాల ద్వారా విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకతను వెలికతియ్యవచ్చు అన్నారు. అనంతరం ప్రతిభ కనపరచిన విద్యార్థులకు బహుమతులను డాక్టర్ పంపినిచేశారు. డాక్టర్ మల్లికార్జున కు ప్రిన్సిపాల్ మాచాని కవిత మెమోంటో ఆoదచేసి కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంఛార్జ్ అనురాధ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.