జాతీయ విజ్ఞాన దినోత్సవ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ కడప: బీరం శ్రీధర్ రెడ్డి అంతర్జాతీయ పాఠశాలలో ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వీనుల విందుగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంవత్సర జాతీయ సైన్స్ దినోత్సవ నేపథ్యం అయినటువంటి “Indigenous technology of vikasit Bharath” లో భాగంగా కృత్రిమ టెక్నాలజీని ఉపయోగించుకొని దాని ఆవశ్యకతను తెలియజేసే విధంగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీరం విద్యాసంస్థల కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి , చైర్పర్సన్ సరస్వతమ్మ మరియు డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్ పాల్గొన్నారు. విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులతో, కళాత్మక ఆకృతులతో, ఆవిష్కరణలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ భారతదేశ గడ్డపైనే చదువుకొని తలమానికమైన పరిశోధనలు జరిపి సైన్స్ లోని శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన మేధావి డాక్టర్ సర్ సి.వి.రామన్ అని,భారతీయ విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను ఇనుమడింపజేసిన మేధావులలో సర్ సి.వి.రామన్ అగ్రగన్యుడని, వైజ్ఞానిక ఆవిష్కరణలలో భారతీయులకు నోబెల్ రావడం గగనం అలాంటిది సర్ సి.వి.రామన్ ఆ ఘనతను సాధించి విజ్ఞాన శాస్త్రంలో నోబెల్ అందుకున్న మొట్టమొదటి ఏకైక ఆసియా వాసిగా నిలిచారనివిద్యార్థులకు ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మరియు సైన్స్ డే యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు.డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్ మాట్లాడుతూ నా మతం సైన్స్ దాన్ని జీవితాంతం ఆచరిస్తా అని చెప్పి తుది శ్వాస వరకు సైన్స్ పరిశోధనలోనే తన జీవితాన్ని గడిపిన మహోన్నత వ్యక్తి సర్ సివి రామన్ అనిఆయన ఆవిష్కరించిన రామన్ ఎఫెక్ట్ పరిశోధనకు అంతర్జాతీయ ఖ్యాతి లభించడంతో ఆ ఆరోజు ని మనం జాతీయ సైన్స్ దినోత్సవం గా జరుపుకుంటామని దేశంలోని ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల మక్కువను ఏర్పరచుకొని ఉన్నత పరిశోధనలను గావించి తమ ప్రతిభను నలుమూలలకి విస్తరింప చేయాలని చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారి ప్రాజెక్టులతో పాఠశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్వేతా , కళాశాల ప్రిన్సిపల్ హేమ చందర్ , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.