అన్ని శాఖల సహకారంతో బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేస్తాం
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: అన్ని శాఖల సహాయ సహకారాలతో మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేస్తామని నంద్యాల ఆర్డీవో మల్లికార్జున్ రెడ్డి పేర్కొన్నారు. మహానంది క్షేత్రంలో పోచ బ్రహ్మానంద రెడ్డి విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన కోఆర్డినేటర్ సమావేశంలో అధికారులతో ఆర్డిఓ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖలకు సంబంధించి ఎవరికి కేటాయించిన విధులను వారు కచ్చితంగా నిర్వహించాలని సూచించారు. ఏ చిన్న పొరపాటు జరిగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పారిశుధ్యం లోపించి ఏదైనా సమస్యలు తలెత్తితే ఇ ఓ ఆర్ డి ఎంపీడీవో సంబంధిత పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తప్పవని హెచ్చరించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడు రోజులపాటు మెడికల్ క్యాంపు 2 రెండు చోట్ల ఏర్పాటు చేస్తున్నట్లు తిమ్మాపురం పి.హెచ్.సి భగవాన్ దాస్ పేర్కొన్నారు. జె ఎస్ డబ్ల్యూ ఆధ్వర్యంలో కూడా మెడికల్ క్యాంపు ఏర్పాటుతోపాటు 108, 104 వాహనాలను కూడా సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలిపారు. పార్కింగ్ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆలయం ముందు భాగాన ఎలాంటి విద్యుత్ సమస్య తలెత్తకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ మూడు షిఫ్టుల్లో నిరంతరం సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మాట్లాడుతూ పార్కింగ్ మరియు ఎడ్ల పందేల వద్ద తాగునీటి కోసం ప్రత్యేకంగా ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న పొదలను తొలగిస్తూ మహానంది వ్యవసాయ కళాశాల రహదారిలోని గుంతలను తాత్కాలికంగా పూడ్చి వేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ అదరపు బస్సులను ఏర్పాటు చేస్తుందని నంద్యాల డిఎం పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఎక్సైజ్ శాఖ వారు రోజులపాటు మద్యం షాపులను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నంద్యాల డిఎస్పి పేర్కొన్నారు. ఫారెస్ట్ మరియు ఆర్టీవో తదితర విభాగాలకు చెందిన అధికారులు కూడా పాల్గొని తమకు కేటాయించిన విధులను నిర్వర్తిస్తామని ఆర్డీవోకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి తాసిల్దార్ శ్రీనివాసులు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి ఏ ఈ ఓ లు మధు, వెంకటేశ్వర్లు, సిఐ శివకుమార్ రెడ్డి మహానంది ఎస్ఐ నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.