టీడీపీ నాయకుల హత్య కేసులో ముద్దాయిలు అరెస్టు
1 min readపల్లెవెలుగు వెబ్, గడివేముల: కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో ఈ నెల 17న జరిగిన టీడీపీ నాయకుల జంట హత్య కేసులో ముద్దాయిలను అరెస్టు చేసినట్లు నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు. శుక్రవారం పాణ్యం సర్కిల్ కార్యాలయంలో ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ వివరాలు వెల్లడించారు. పాణ్యం మండలం బలపనూరు మెట్ట వద్ద తిరుమలగిరి టౌన్షిప్ సమీపంలో ముద్దాయిలు ఉపయోగించిన రెండు వాహనాలు, 4వేల కొడవళ్లు, రెండు పిడిబాకులు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
హత్యలో ఎ1 గా రాజా రెడ్డి, ఎ2గా శ్రీకాంత్ రెడ్డి,ఎ3గా కేధార్ నాద్ రెడ్డి తో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేశామని, ముద్దాయిలను నంద్యాల కోర్టులో హాజరు పరుస్తామన్నారు. గ్రామాధిపత్యం, రెండు కుటుంబాల మధ్య వైరమే జంట హత్యలకు కారణమైందని విచారణలో తేలిందన్నారు. ఈ సమావేశంలో సీఐ జీవన్ గంగ నాథ్ బాబు, మోహన్ రెడ్డి, గడివేముల, పాణ్యం, నందివర్గం ఎస్ఐలు శ్రీధర్, సుధాకర్ రెడ్డి, రామాంజనేయ రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.