2023లో ప్రాంతీయ పార్టీలదే హవా !
1 min readపల్లెవెలుగు వెబ్ : ప్రజలు ప్రాంతీయ పార్టీలనే ఎన్నుకుంటారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీల ప్రాధాన్యం తగ్గుతుందని కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి వ్యాఖ్యానించారు. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో లాగే కర్ణాటకలోనూ ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో కూర్చుని కర్ణాటకను పాలించాలని ప్రజలు కోరుకోవడం లేదని ఆయన అన్నారు. దక్షిణాదిలో ఒక్క కర్ణాటక తప్ప మిగిలిన ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరించారని అన్నారు. కర్ణాటకలో కూడ వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ హవా నడుస్తుందన్నారు. ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడులో కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు తిరస్కరించారని అన్నారు. కరోన మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రభుత్వం అలసత్వంతో ఉందని విమర్శించారు. ఈ పరిస్థితి పై రెండు, మూడు రోజులైన అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు.