జర్నలిస్ట్ ల దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…
1 min readచింతలపూడి టిడిపి అభ్యర్థి సొంగా రోషన్ కుమార్
ఘనంగా ఏపిడబ్ల్యూజెఎఫ్ జిల్లా కమిటీ తొలి సమావేశం
జిల్లా నలుమూలల నుండి పాల్గొన్న జర్నలిస్టులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని చింతలపూడి నుండి టిడిపి అభ్యర్థి గా విజయం సాధించిన తరువాత జిల్లాలో జర్నలిస్ట్ లు ఎదుర్కొంటున్న దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సొంగా రోషన్ కుమార్ జర్నలిస్ట్ లకు హామీ ఇచ్చారు. స్థానిక రెవిన్యూ భవన్ లో శుక్రవారం ఏపిడబ్ల్యూజెఎఫ్ జిల్లా కమిటీ తొలి సమావేశం జిల్లా అధ్యక్షులు ఎస్ డి జబీవుల్లా (జబీర్) అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రోషన్ కుమార్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన జర్నలిస్ట్ లను ఉద్దేశించి మాట్లాడుతూ తాను చింతలపూడి నుండి ఎంఎల్ఏ గా గెలుపొందిన తరువాత జిల్లాలో జర్నలిస్ట్ ల ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తానన్నారు. జిల్లాలో ప్రధానంగా ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జర్నలిస్ట్ ల పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో పీజులలో రాయితీ వంటి ప్రధాన సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని రోషన్ కుమార్ అన్నారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షులు జబీర్, కార్యదర్శి హరీష్, జిల్లా ఎపిడబ్ల్యూజెఎఫ్ కార్యవగ్ర సభ్యులను రోషన్ కుమార్ కి పరిచయం చేసారు. అనంతరం ఆయనను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ముందుగా సీనియర్ జర్నలిస్ట్ ఎల్.వి. నాగకుమార్ ఆకస్మిక మృతి పట్ల జిల్లా కమిటీ సంతానం తెలిపారు. ఆయన మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటన్నారు. నాగకుమార్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు.ఏపిడబ్ల్యూజెఎఫ్ జిల్లా కమిటీ.ద్వారకా తిరుమల రిపోర్టర్ శ్రీనివాసరావు పై కొంతమంది వ్యక్తులు గురువారం చేసిన దాడి హేయమైన చర్య అని జిల్లా ఏపిడబ్ల్యూజెఎఫ్ కమిటీ ఖండించింది. ఇటీవల ఏలూరులో జరిగిన సిద్ధం సభలోనూ, నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న చింతలపూడి సభలోనూ. అలాగే రాప్తాడులో వైకాపా చేపట్టిన సభలోనూ జర్నలిస్ట్ లపై జరిగిన దాడులను ఖండించారు. అటువంటి సంస్కృతి పునరావృతం కాకూడదనేదే ఏపిడబ్ల్యూజెఎఫ్ నినాదామని కమిటీ అభిప్రాయ పడింది.దాడికి పాల్పడిన ఘటనల పై పోలీసులు విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కమిటీ నేతలు కోరారు.ఈకార్యక్రమంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బాలసౌరి , శంకర్రావు లు మాట్లాడుతూ ప్రతి మూడు మాసాలకు ఒకసారి జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని సమస్యలపై చర్చించుకుని తీసుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని సూచించారు. అనంతరం జిల్లా కార్యదర్శి హరీష్ కి పలువురు జర్నలిస్టులు జన్మదిన సందర్భంగా కేకు కట్ చేసి శుభాకంక్షలు తెలియాజేసరు.ఈకార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి కె.చిన్నారావు, కమిటీ సభ్యులు శిలారపు రుషిరావు , తోట వెంకట్రావు, సోమశేకర్, యర్రా జయదాసు,బాబ్జి, శ్రీనివాస్, డి సత్యనారాయణ, సీహెచ్ శ్రీనివాస్, ప్రతాప్, సాజ్జి , పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.