పాన్-ఆధార్ గడువు పెంపు
1 min readపల్లెవెలుగు వెబ్ : పాన్-ఆధార్ గడువు మరోసారి కేంద్రం పెంచింది. కరోన రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. పాన్-ఆధార్ గడువును మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సెప్టంబర్ 30 వరకు పాన్-ఆధార్ అనుసంధానం చేయవచ్చు. జూన్ 30తో గడువు ముగిస్తున్న కారణంగా.. మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మొదట 2020 జూన్ 30 వరకు, తర్వాత 2021 మార్చి 31 వరకు, తర్వాత ఈ ఏడాది జూన్ 30 వరకు పొడిగించారు. ఇప్పుడు సెప్టంబర్ 30 వరకు గడువు తేదిని పొడిగించారు.